హీరోయిన్లు ఆ కోరిక తీర్చుకోవడానికి కెమేరామెన్లకు ఖరీదైన గిఫ్త్స్ ఇస్తారా?

ఈ ప్రపంచంలో ఏ భాష సినిమా ఇండస్ట్రీలో అయినా స్టార్ హీరోయిన్‌గా పాపులారిటీ సాధించాలంటే ఎవరో ఒకరి సపోర్ట్ ఖచ్చితంగా వుండాలి, లేదంటే కుదరదు అని అంటుంటారు. అది నిర్మాత కావచ్చు, హీరో కావచ్చు, దర్శకుడు కావచ్చు, కెమెరామెన్ కావచ్చు. ఈ క్రమంలోనే గత కొన్నాళ్లుగా పలు సినిమా పరిశ్రమలలో అమ్మాయిలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య కాంప్రమైజ్. అవును, అలా కమిట్ అయ్యినవారికి కాస్త సుడి బాగుంటే ఎక్కడికో వెళ్లిపోవచ్చు అని ఎన్నాళ్లుగానో వినబడుతున్నమాట. లక్ బావున్నా సక్సెస్ వచ్చినా కాంప్రమైజ్ కాకపోతే మాత్రం పక్కన పడేస్తారు అని టాక్.

ఓ సినిమాలో పాత్రనే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అవును, ఖడ్గం సినిమాలో సంగీత క్యారెక్టరే దీనికి ఉదాహరణ. ఈ క్రమంలో హీరోయిన్స్ షూటింగులలో ఎంతసేపు వుంటారో, హోటల్స్ లో కూడా ఆదేమాదిరి గడుపుతారని టాక్. అంతే కాకుండా, కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్స్ అలా బెడ్రూంలో సపోర్ట్ చేస్తేనే సినిమా తర్వాత సినిమా ఉంటుంది అని చెబుతూ వుంటారు. అయితే, కొందరు హీరోయిన్స్ వుంటారు, వీళ్ళు చాలా తెలివైనవాళ్లు. అలాంటి పాడుపనులకు దూరంగా వుండడం కోసం వీరు ఎక్కువగా కెమెరా మేన్, మేకప్ మేన్ లను నమ్ముకుంటారట. ఎందుకంటే వీరు వున్న అందం కంటే ఎక్కువ అందంగా కనబడాలంటే వీరి అవసరం తప్పనిసరి. దానికోసం వారికి ఖరీదైన వస్తువులు కూడా గిఫ్ట్స్ గా ఇస్తారని తెలుస్తోంది.

ఎందుకంటే ఒక్కసారి ఒక హీరోయిన్ అందంగా వుంది, రోమాంటిగ్గా వుంది, సెక్సీగా వుంది అని పేరు తెచ్చుకుంటే, అవకాశాలు వాటంతట అవే వస్తాయి అని అందరికీ తెలిసిందే. అందుకే కొందరు ఈ తెలివైన మార్గాన్ని అనుసరిస్తారట. ఇక ఈ మధ్య కాలంలో మీటు ఉద్యమం అన్ని పరిశ్రమలోను బాగా విస్తృతం అవడంతో దర్శకుల, నిర్మాతల ఆగడాలకు కాస్త కళ్ళెం పడిందని కొందరు అనుకుంటున్నారు. ఏది ఏమైనా అలాంటి పనులు ఎవరికైనా హేయనీయమే. కళను కళలాగ చూసినపుడు మాత్రమే ఆ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోంచగలరు. లేదంటే ఎంతటివాడికైనా పతనం తప్పదు.