డెవిల్ సినిమా నుంచి అదిరిపోయి అప్డేట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..!!

బింబిసారా సినిమాతో మళ్లీ తన కెరీయర్ని పుంజుకున్నారు నటుడు కళ్యాణ్ రామ్.. పాన్ ఇండియా మార్కెట్ ని సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ త్రిల్లర్ జోనర్లో పలు సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా డెవిల్ అనే సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ గా కూడా నటిస్తూ ఉన్నారు. నవంబర్ 24న ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లు వెలుపడుతూనే ఉన్నాయి.

Image

డెవిల్ సినిమాలో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తున్నది. అయితే డెవిల్ సినిమా నుంచి మనిమేకల క్యారెక్టర్ లో హీరోయిన్ మాళవికనాయర్ నటిస్తున్నట్లు ఆ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా చిత్ర బృందం రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు క్యూటుగా కనిపించే పాత్రలు నటించిన మాళవిక మొదటిసారి డెవిల్ సినిమాలో ఒక పవర్ఫుల్ ప్లే రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన కొత్త లుక్ డెవిల్ సినిమాకి ఎంతవరకు సక్సెస్ను తీసుకువస్తుందా చూడాలి మరి.

ఇదంతా ఇలా ఉంటే డెవిల్ సినిమా విషయంలో ఇప్పటికే చాలా ఇష్యూస్ మొదలయ్యాయి.. నవీన్ మేడారం దర్శకత్వం చేయాల్సి ఉండగా ఈ సినిమా షూటింగ్ ని కూడా సగానికి పైగా పూర్తి చేసిన తర్వాత సడన్గా డైరెక్టర్ నవీన్ మేడారం డెవిల్ సినిమా నుంచి తప్పుకున్నారు. ప్రొడ్యూసర్ అభిషేక్ నాయర్ దర్శకత్వం లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాకి సంబంధించి ఏం జరుగుతుందో పూర్తి వివరాలు తెలియాలి అంటే నవంబర్ 24 వరకు వేచి ఉండాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఈ పోస్టర్ వైరల్ గా మారుతోంది.