రేణు దేశాయ్ పై పవన్ కళ్యాణ్ కూతురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన ఫాలోయింగ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది. అటు రాజకీయాలతో ఇటు సినిమాలతో ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్నాడు. మేటర్ లోకి వస్తే పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్.. బద్రి, జానీ సినిమాల్లో కలిసి నటించిన సమయంలో ప్రేమలో పడ్డారు.

తర్వాత పెళ్లి చేసుకుని.. అఖీరా నందన్, ఆధ్యాలకు జన్మనిచ్చారు. 11 ఏళ్లు కాపురం చేశాక ఏవో మనస్పార్ధాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్.. రవితేజ హీరోగా నటిస్తున్న ” టైగర్ నాగేశ్వరరావు ” సినిమాలో లవణం పాత్రలో నటిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రేణు దేశాయ్ మాట్లాడుతూ..” ఈ సినిమా విషయంలో ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ లో నా కూతురై ఆధ్యా నుంచి వచ్చిందని వెల్లడించింది.

నీ ఏజ్ కు తగ్గ పాత్రలో నటిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అమ్మా అని చెప్పింది. తను అలా చెప్పడంతో నాకు చాలా హ్యాపీగా అనిపించింది “అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రేణు దేశాయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.