వరుణ్ తేజ్ పెళ్లి మోస్ట్ స్పెషల్.. ఇప్పటి వరకు మెగా హీరోల ఆల్బమ్ లో లేని స్పెషల్ గెస్ట్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ .. ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో త్వరలోనే స్టార్ హీరోగా ఉన్న వరుణ్ తేజ్ పెళ్లి జరగబోతున్న విషయం తెలిసిందే. మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా అభిమానులకు తెలియజేశారు . కొంతకాలంగా గుట్టూ చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతున్న ఈ జంట ఫైనల్లీ జూన్ 9వ తేదీ నాగబాబు నివాసం లో నిశ్చితార్దహ్మ్ చేసుకుని ఒకటయ్యారు.

వీళ్ళ పెళ్లి నవంబర్ 1న గ్రాండ్గా ఇటలీలో జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈ పెళ్లి చాలా సింపుల్గా చేసుకోబోతున్నారట . మెగా ఫ్యామిలీలో ఏ హీరో కూడా ఇంత సింపుల్ గా పెళ్ళి చేసుకోలేదని వరుణ్ తేజ్ – లావణ్య ఇష్టపూర్వకంగానే చాలా సింపుల్ గా ఈ పెళ్లి చేసుకోబోతున్నారు అని తెలుస్తుంది. అంతేకాదు వరుణ్ తేజ్ పెళ్లి మెగా ఫ్యామిలీ లోనే మోస్ట్ మోస్ట్ స్పెషల్ ..

ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన మెగా హీరోల పెళ్లిలో ఎక్కడ కూడా మెగా మనవరాలు క్లీన్ కార.. ఫోటో లేనేలేదు .. ఫస్ట్ టైం వరుణ్ తేజ్ పెళ్లి ఆల్బమ్ లో మెగా మనవరాలు క్లీన్ కార ఫోటో ఆడ్ అవ్వబోతుంది . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు ఆ లక్కీ హీరో కూడా మెగా హీరో వరుణ్ తేజ్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు..!!