తనకు ఇష్టం లేకుండానే అలాంటి పని చేస్తున్న శోభిత..!!

తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్గా అవకాశాలు రావడం చాలా గగనంగా మారుతోంది.అయితే అలాంటి సమయంలోనే హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.. బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ టాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది. శోభితాని చూస్తే నిజంగానే ఇమే తెలుగమ్మాయి అనే అనుమానం కూడా అందరికీ కలుగుతుంది. ప్రస్తుతం బాలీవుడ్లో వరస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది ఈ ముద్దు గుమ్మ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే పలు రకాల ఫోటోలను షేర్ చేయడమే కాకుండా అప్పుడప్పుడు అభిమానులతో చిట్ చాట్ కూడా నిర్వహిస్తూ ఉంటుంది.

I'm recalibrating my choices as an actor, says Sobhita Dhulipala - Times of  India

తాజగా చిట్ చాట్ నిర్వహిస్తూ మనసులో విషయాలను సైతం తెలియజేసింది శోభిత ధూళిపాళ్ల.. కెరియర్ పరంగా సంతృప్తిగా ఉన్నారా అంటే మనకు నచ్చిన పాత్రలో నటించే అవకాశాలు రాకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటాను అన్నట్టుగా తెలియజేసింది.. ఈ ముద్దుగుమ్మ సమాధానంతో కెరియర్ లో ఏదో చాలా అసంతృప్తిగా ఈమెకు ఉన్నట్టుగా అనిపిస్తోందని పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. లేకపోతే తనకు ఇష్టం లేకుండానే సినిమాలలో నటిస్తోందా అనే అనుమానాలను కూడా తెలుపుతున్నారు.

Sobhita Dhulipala comments on criticism against her performance in Made in  Heaven, says she would've liked to 'play Tara differently' | Web-series  News - The Indian Express

తను ఎప్పుడూ కూడా బిజీగా ఉండాలి వరుస సినిమాలు చేయాలని అసలు అనుకోవడంలేదట.. కేవలం తనకు నచ్చిన పాత్ర వస్తే మనసుపెట్టి నటిస్తానని తెలియజేస్తోంది. చాలా సినిమాలలో పాత్రలను శోభిత మనసు చంపుకొని నటిస్తుందేమో అన్నట్లుగా ఈమె వ్యాఖ్యలు చేసినట్లు పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి శోభిత కెరియర్ పరంగా బిజీగా ఉన్నప్పటికీ సినిమాలలో నటించే అవకాశాలు ఎక్కువగా రావడంలేదని తెలియజేసింది.