OG: వైలెన్స్ తోనే అరాచకం సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ ఓజి టీజర్..!!

ఇటీవలే పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వం వహించగా ఇందులో సాయి ధరంతేజ్ కీలకమైన పాత్రలు నటించారు. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పలు సినిమాల అప్డేట్లను సైతం చిత్ర బృందం ప్రకటిస్తూనే ఉంది. తాజాగా డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో నటించిన ఓజి సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది .ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

OG (2024) - IMDb

తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల కావడం జరిగింది ఈ రోజు ఉదయం 10:35 నిమిషాలకు టీజర్ లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. ఓజి టీజర్ రిలీజ్ చేస్తూ పవన్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ అంటూ తెలియజేసింది చిత్ర బృందం ఇందులో హీరోయిన్గా ప్రియాంక అరుణ్ మోహన్ నటిస్తోంది ఇప్పటికే ముంబై,పూణే హైదరాబాద్ వంటి నగరాలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. సంగీతాన్ని థమన్ అందిస్తూ ఉన్నారు.బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి ,శ్రియ రెడ్డి కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Hungry cheetha అంటూ ఓజీ వీడియో గ్లింప్స విడుదల చేయడం జరిగింది.. ఆకలి మీదున్న చిరుత దాడి చేస్తే ఎలా ఉంటుందో చెబుతూ పవన్ కళ్యాణ్ ని చూపించిన తీరు అందరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది ఇక థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. మొత్తానికి ఓజితో పవన్ కళ్యాణ్ అభిమానులకు ఫుల్ మీల్స్ ఇవ్వడం ఖాయం అన్నట్లుగా తెలుస్తోంది. పూర్తిగా వైలెన్స్ తో ఈ సినిమా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.మరి ఏ మేరకు ఈ సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.