అప్పట్లోనే బాహుబలి లాంటి సినిమాలో నటించిన ఎన్టీఆర్, బాలయ్య.. కానీ రిలీజ్ కాలేదు.. కారణం..?

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే మిగతా ఇండస్ట్రీలు అన్నిటికీ చిన్న చూపు ఉండేది. రాజమౌళి ఏ ముహూర్తాన బాహుబలి సినిమా మొదలు పెట్టాడు గాని బాహుబలి సినిమాతో ప్రపంచ నలుమూలలో ఉన్న అన్ని ఇండస్ట్రీలు తెలుగు ఇండస్ట్రీ వైపు తలెత్తి చూశాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వపడేలా బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి సక్సెస్ సాధించింది. అయితే అలాంటి బాహుబలి సినిమాని అన్నగారు ఎప్పుడో బాలకృష్ణతో కలిసి నటించారట. కానీ ఆ సినిమా కొన్ని కారణాలవల్ల పూర్తి కాలేదు. ఇంతకీ ఏంటా సినిమా..? ఎందుకు రిలీజ్ కాలేదు..? ఒకసారి తెలుసుకుందాం.

ఏ ఓ కారణాలతో టాలీవుడ్‌లో చాలా సినిమాలు షూటింగ్ పూర్తయిన తర్వాత రిలీజ్ కాకపోవడం, సగం షూటింగ్ పూర్తిచేసుకునే ఆగిపోవడం, సెట్స్‌పైకి వచ్చిన తర్వాత సినిమా ఆగిపోవడం జరుగుతూనే ఉంటాయి. అలాంటిది అప్పట్లోనే బాహుబలి లాంటి ఓ సినిమా షూటింగ్ మొదలు పెట్టారట. కొంత షూటింగ్ పూర్తి అయ్యేసరికి ఆ సినిమా ఆగిపోయింది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే ” కంచు కాగడా ” . ఈ సినిమాను బాలయ్యతో కలిసి ఓ భారీ జానపద చిత్రంగా రూపొందించాలని ఉప్పలపాటి విశ్వేశ్వరరావు భావించాడట. కాస్త లేట్ అవ్వడంతో ఆ టైంలో మరో స్టోరీ రాసి ‘ కంచుకోట ‘ సినిమాను నిర్మించారు.

దీనికి కేఎస్ రావు దర్శకత్వం వహించగా బాలకృష్ణ కీరోల్‌ ప్లే చేశాడు. సావిత్రి, దేవిక హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు అప్పట్లో రూ7 లక్షలు బడ్జెట్ పెడితే సినిమా 30 సెంటర్లలో విడుదల కేవలం ఏడు రోజుల్లోనే రూ.7 లక్షలు వసూలు చేసింది. ఇక దీని తర్వాత ఎన్టీఆర్ తో కంచుకాగ‌డ‌ సినిమాను ప్లాన్ చేశారు. దీనికి కూడా విశ్వేశ్వరరావ్‌ నిర్మాతగా వ్యవహరించాడు. దీనిని జానపద చిత్రంలా తెరకెక్కించాలి అనుకున్నారు. ఇందులో జమున హీరోయిన్.

సినిమాలో ఎన్టీఆర్ మరియు బాలకృష్ణతో కొంత షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత.. జమున గర్భవతి కావడంతో ప్రసవమయ్యాక సినిమా చేద్దామనుకున్నారు. కానీ కొన్ని అనివార్య‌ కారణాలవల్ల ఇందులో కీలక పాత్రలో నటించే బాలీవుడ్ హీరో మరణించాడు. దీంతో ఈ సినిమా అక్కడితో ఆగిపోయింది. అయితే ఆ సినిమాని అప్పట్లోనే భారీ బడ్జెట్లో బాహుబలి రేంజ్‌లో నిర్మించాలని మూవీ టీం అనుకున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.