బిగ్ బాస్ రతిక నిజస్వరూపాన్ని బయటపెట్టిన రాహుల్..!!

బిగ్ బాస్ తెలుగు సీజన్ -7 మొదలయ్యి ఇప్పటికి రెండు వారాలు పైనే కావస్తోంది. ఇద్దరు కంటిస్టేన్స్ హౌస్ నుంచి కూడా బయటకు రావడం జరిగింది.. మొదటినుంచి ఈ సీజన్ పై అభిమానులు చాలా ఆసక్తి కనబరిచేలా చేసింది. ముఖ్యంగా ఈసారి ఉల్టా పుల్టా అంటూ సరికొత్తగా గేమ్ డిజైన్ చేయడం జరిగింది బిగ్ బాస్ నిర్వహకులు. ముఖ్యంగా రతిక, శోభా శెట్టి, యావర్, పల్లవి ప్రశాంత్, అమరదీప్ సైతం గొడవలు చూడడానికి చాలా చిరాకుగా అనిపిస్తూ ఉన్నాయి.

గతవారం రతిక చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చేపల మార్కెట్లో ఉన్నట్టుగా గట్టిగ అరవడంతో ఇదంతా ఫేక్ గా అన్నట్లుగా అభిమానులు తెలియజేశారు. మనసులను వాడుకొని రతిక సింపతి క్రియేట్ చేస్తోందని పలువురి నెట్టిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. తన మాజీ లవర్ ని గుర్తు చేసుకుంటూ ఏడవడం సింపతి కోసమే మనసులను వాడుకుంటోంది ఇదంతా ఫేక్ అని రతిగా మాజీ ప్రియుడు రాహుల్ సింప్లిగంజ్ ఆమె పేరును చెప్పకుండానే ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది.

వాస్తవానికి రాహుల్ కు బిగ్ బాస్ కొద్దేమి కాదు గతంలో సీజన్-3 రాహుల్ విన్నర్ గా నిలిచారు. ఎవరు ఫేక్ ఆడుతున్నారు ఎవరు డ్రామాలు చేస్తున్నారు ఎవరు సింపతి కోసం ఏడుస్తున్నారు అనే విషయాన్ని ఇలాగే పసికట్టేయగలడు.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో బిగ్ బాస్ లో సింపతి చూపించి పేర్లు వాడుకొని గేమ్ ఆడాలని చూస్తున్నారు.. ఫేక్ సింపతి గేమ్స్ ఎప్పటి వరకు? ఎప్పుడు అందరూ సొంత టాలెంట్ తోని పైకి రావాలనుకుంటారు కొంతమంది మాత్రం పక్కనోళ్ల పేరు సేమ్ ఉపయోగించుకోవాలని చూస్తూ ఉంటారు. ఆల్ ది బెస్ట్ టు ఇన్నర్ పర్సన్స్ అంటూ రాహుల్ పేరు చెప్పకపోయినా ఇది కచ్చితంగా రతికను ఉద్దేశించే చెప్పారని అభిమానులు తెలియజేస్తున్నారు.