గూఢ‌చారిని కొంటెగా క‌వ్విస్తోన్న‌ స‌లార్‌, కేజీయ‌ఫ్ భామ‌లు…!

యంగ్ హీరో అడవి శేష్‌ ఇటీవల హిట్ 2 సినిమాతో సూపర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న మూవీ గూడచారి 2 ఐదేళ్ల క్రితం రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన గూడచారి కి సీక్వల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక మొదటి పార్ట్‌ సూపర్ హిట్ కావడంతో దీనికి సీక్వెల్ గా వస్తున్న హిట్ 2 పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

వినయ్ కుమార్ సిరిగినీడి రూపొందిస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం దుబాయ్ కి వెళ్ళిన అడవి శేషు ఇటీవలే అక్కడ జరిగిన సైమా అవార్డ్స్ వేడుకల్లో కూడా పాల్గొన్నాడు. ఇక అత‌డు మేజర్ మూవీలో నటించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో అద్భుత నటనకు గాను క్రిటిక్స్ అవార్డును అందుకున్నాడు.

ఈ నేపద్యంలోనే దుబాయ్‌లో షూటింగ్ తో పాటు ఫ్రెండ్స్ తో ఒక మంచి టైంను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా సలార్‌ హీరోయిన్ శృతిహాసన్, కేజిఎఫ్ బామ్మ శ్రీనిధి శెట్టితో కలిసి ఒక క్రేజీ పిక్ ను దిగాడు. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా వీరిముగ్గురు ఈ పిక్ లో అదిరిపోయే స్టిల్ లో తమ కాస్ట్యూమ్ తో అదరగొట్టారు.