“నేటి జనరేషన్ కి పెళ్లి అంటే అదే”.. నిజాన్ని పచ్చిగా చెప్పేసిన జగపతిబాబు..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న జగపతిబాబు .. ప్రెసెంట్ ఎలాంటి క్రేజీ స్థానంతో ముందుకు వెళ్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరో అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే జగపతిబాబు.. ఇప్పుడు విలన్ రోల్స్ కి పెట్టింది పేరుగా ముందుకు వెళ్తున్నారు. కాగా రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆయన లైఫ్ కి సంబంధించిన పలు విషయాలపై ..ఆయన పైన వచ్చిన గాసిప్స్ పై రియాక్ట్ అయ్యారు.

ఇలాంటి క్రమంలోనే నేటి జనరేషన్ లో పెళ్లి అనేది జస్ట్ ఒక టైం పాస్ లానే చూస్తున్నారు అని .. ఎంత త్వరగా ప్రేమించుకుంటారో అంతే త్వరగా పెళ్లిలు చేసుకొని డివర్స్ తీసుకోవడానికి ముందుంటున్నారే కానీ పెళ్లి బంధాన్ని నిలుపుకోవడానికి ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించలేదని.. నేటి జనరేషన్ కి పెళ్లి అంటే ఒక గేమ్ లానే ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు .

అయితే జగపతిబాబు చెప్పిన మాటలను చాలామంది సమర్థిస్తున్నారు . నేటి కాలం జనరేషన్ కి పెళ్లి అనేది ఒక గేమ్ లానే చూస్తుంది .. కానీ ఒక బాధ్యత బంధంగా ఎవరు చూడట్లేదు అని ..ఆయన చెప్పిన మాటలను యాక్సెప్ట్ చేస్తూ ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో జగపతిబాబు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!