జాన్వీ ధరించిన ఈ డ్రెస్సు ఖరీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్లబెడతారు..

ప్రముఖ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు అందాలు అరబోయ్యడంలో తల్లిని మించిపోయిందనే చెప్పాలి.  ‘ ధడక్ ‘ అనే సినిమా తో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా జాన్వీ తన అందం, నటనతో మంచి మార్కులు వేయించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుస సినిమా లో నటిస్తూ బిజీ గా ఉంది.

అలానే జాన్వీ కపూర్ తెలుగు లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘దేవర ‘అనే సినిమా లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించబోతుంది ఈ చిన్నది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ తో తెరకేక్కబోతున్న ‘ దేవర ‘ సినిమా జాన్వీ కపూర్ మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. అందుకే ఈ సినిమా కోసం జాన్వీ చాలా ఉత్సాహం గా ఎదురుచూస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమా కి సంబందించ్చి జాన్వీ ఫస్ట్ లుక్ అందరిని అందరిని ఆకట్టుకుంటుంది.

ఇక ‘ దేవర ‘ సినిమా తో ఈ ముద్దు గుమ్మ పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని అర్ధం అవుతుంది. అయితే జాన్వీ కపూర్ సినిమా లో నటిస్తూనే సోషల్ మీడియా లో కుడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లూ కలర్ మినీ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. డెవిల్ క్రోమా బ్రాండ్ కి సంబంధించిన ఈ డ్రెస్ కటింగ్ తెలిసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. జాన్వీ అందాలు అరబోస్తే దిగిన బ్లూ మిని డ్రెస్ ఖరీదు రూ. 80 వేల రూపాయలట. ఇక జాన్వీ చీర నుండి బికినీ వరకూ అన్ని రకాల దుస్తులో మెరుస్తూ అభిమానులను ఏంటర్టైన్ చేస్తూ ఉంటుంది.