రష్మిక రివేంజ్ దెబ్బ స్టార్ట్..ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టిందిగా..!!

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం పెళ్లి కాకుండానే విడిపోవడం చాలా చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటుంది . కొంతమంది హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకుని బిడ్డను కూడా కంటూ ఉంటారు . అయితే నేటి జనరేషన్ లో ఉన్న హీరో హీరోయిన్లు మాత్రం కేవలం ప్రేమను ప్రేమగానే చూస్తూ అక్కడితోనే కట్ చేస్తున్నారు తప్పిస్తే ఆ ప్రేమను ముందుకు తీసుకెళ్లడం లేదు.

కాగా ప్రెసెంట్ ఇండస్ట్రీలో రష్మిక మందన్నా – విజయ్ దేవరకొండ పేర్లు ఏ రేంజ్ లో మారు మ్రోగి పోతున్నాయో మనకు తెలిసిందే. ఇద్దరు ప్రేమలో ఉన్నారు అని పెళ్లి చేసుకుంటారని కొందరు అంటుంటే.. లేదు లేదు వాళ్ళు విడిపోయారు అని మరికొందరు అంటున్నారు . అయితే రీసెంట్గా రష్మిక నటించిన అనిమల్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయింది . ఈ పోస్టర్లో ఎర్రటి చీరలో ..మెడలో నల్లపూసలు దండ వేసుకొని చాలా పద్ధతిగా ట్రెడిషనల్ గా కనిపించింది రష్మిక.

అయితే ఈ సినిమాలో రష్మిక – విజయ్ దేవరకొండకు ఇష్టం లేని సీన్స్ చేసిందని.. దానికి కారణం కూడా విజయ్ దేవరకొండ అని.. ఖుషి సినిమాలో హద్దులు మీరి ఆయన నటించడంతోనే రష్మిక ఇప్పుడు హద్దులు మీరాల్సి వచ్చిందని.. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా విజయ్ దేవరకొండ దిమ్మతిరిగిపోతుందని కామెంట్స్ చేస్తుంటే ..మరికొందరు అది కేవలం సినిమా ..వాళ్ళిద్దరూ స్టార్ సెలబ్రిటీలు.. సినిమాని సినిమాగా చూడటం వాళ్ళకి బాగా తెలుసు.. మీరు వర్రీ అవ్వకండి అంటూ కౌంటర్స్ వేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో రష్మిక మందన విజయ్ దేవరకొండ ల పేర్లు వైరల్ గా మారాయి..!!