అమ్మ బాబోయ్.. “నువ్వు నాకు నచ్చావ్” సినిమాలో ఇంత పెద్ద తప్పు చేసారా.. ఇన్నాళ్లు కనిపెట్టలేకపోయామే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు వచ్చిన .. కొన్ని సినిమాలంటే జనాలకి తెగ ఇష్టం ఏర్పడిపోతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆ సినిమాలో రిలీజ్ అయ్యి దశబ్ధ కాలం దాటుతున్న ఇప్పటికీ ఆ సినిమాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . అలాంటి సినిమాలలో టాప్ ప్లేస్ లో ఉంటుంది “నువ్వు నాకు నచ్చావ్”. వెంకటేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే మనం ఫ్యామిలీతో చూసి మరి ఎంజాయ్ చేస్తూ ఉంటాం .

ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టదు.. అలాంటి డైలాగ్స్ అలాంటి సీన్స్ ఈ సినిమాలో బోలెడన్ని ఉన్నాయి . మరీ ముఖ్యంగా ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సినిమా డైలాగ్స్ అనే చెప్పాలి. ఒక్కొక్క డైలాగ్ ఎంత బాగుంటుందో ఇప్పటికీ మన డైలీ లైఫ్ రొటీన్ లో వాడుతూనే ఉంటాం . కాగా ఈ సినిమాల్లో ఒక బిగ్ మిస్టేక్ ను ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు . ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ కు సిస్టర్ క్యారెక్టర్ లో నటించినా పింకీ ఓ సీన్లో .. ఏం క్లాస్ ఏం చదువుతున్నావ్ పాప అంటే 9th క్లాస్ అంటూ లిటిల్ ఫ్లవర్ స్కూల్ అని చెబుతుంది .

అయితే అదే సినిమాలో ఓ సీన్లో భాగంగా పింకీ స్కూల్ వ్యాన్ చూపిస్తూ ఆ స్కూల్ పై బివిపివి అని రాసి ఉంటారు. దీంతో ఇదే మిస్టేక్ ను ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు జనాలు . అంత పెద్ద డైరెక్టర్ ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యాడబ్బా అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు . అయితే అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టే బతికిపోయాడని ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమంటూ ఆ మిస్టేక్ బయటపడిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..!!