బిగ్ బాస్ హౌస్ లో ‘బేబీ’ సినిమా షురూ… విషయమిదే?

బిగ్ బాస్ షో గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదేవిధంగా బేబీ సినిమా గురించి కూడా ఇక్కడ ప్రస్తావన అనవసరం. ఎందుకంటే ఒకటి సినిమా పరంగా సూపర్ హిట్ అయితే మరొకటి పాపులర్ టి‌వి షో. రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ సినిమా ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నేటి యువత తీరును చెప్పకనే చెప్పింది. దాంతో యూత్ అందరికి సూపర్ గా కనెక్ట్ అయిపోయింది ఈ సినిమా. ఈ క్రమంలో ఇక చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇక విషయం ఏమిటంటే, అచ్చం ఈ మూవీలో చూపించిన విధంగానే ప్రస్తుతం రియల్ లైఫ్ లో కూడా జరుగుతుంది అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. అది మరెక్కడో కాదండీ, ప్రేక్షకులందరికీ ఎంటర్టైన్మెంట్ పంచుతున్న బిగ్ బాస్ ఏడవ సీజన్లో హౌస్ లో కూడా బేబీ సినిమా సీన్ రిపీట్ అవుతుందని నెట్టింట గుసగుసలు వినబడుతున్నాయి. అవును, ఈ షోలో అందరూ పవర్ అస్త్ర కోసం పోటీ పడుతుంటే అటు రతిక, పల్లవి ప్రశాంత్ మాత్రం ఇప్పటి లాగానే గిల్లికజ్జాలతో గొడవలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్శిస్తున్నారు.

మరోవైపు ప్రిన్స్ యావర్ తో కూడా అటు రాధిక ఏదో స్టోరీ నడుపుతుంది అని ఇక బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూసిన ప్రతి ఒక్కరికీ ఇట్టే అర్థం అవుతుంది. పల్లవి ప్రశాంత్, రతిక మధ్య గిల్లికజ్జాలు చూసి ప్రిన్స్ నలిగిపోయాడు. అయితే కంటెస్టెంట్స్ అందరూ కూడా తనను టార్గెట్ చేసినట్లు అనిపిస్తుంది అంటూ శివాజీ దగ్గర తన బాధను చెప్పుకొని ఏడ్చింది రతిక. ఇదంతా చూసిన ప్రేక్షకులు అచ్చం బేబీ సినిమా ఇక్కడ కనబడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇలా బిగ్ బాస్హౌస్ లో కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అనేది కొందరు అనుమానం. మరి మీకేం అనిపిస్తోంది?