పెళ్లికి ముందే మెగా ఇంట్లో లావ‌ణ్య పూజ‌ల‌కు కారణం ఇదే..!!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక వీరి బంధం గురించి అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి మధ్య మధ్యలో అకేషన్లు సైతం జరుపుకుంటున్నారు ఈ జంట. ఇక‌ నిహారిక విడాకుల తరువాత వీరి పెళ్లి క్యాన్సిల్ అయిందని సోషల్ మీడియాలో వార్త వైరల్ అయింది.

నిన్న వినాయక చవితి సందర్భంగా మెగా ఫ్యామిలీతో పాటు లావణ్య కూడా ప్రత్యేక పూజలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో పెళ్లికి ముందే మెగా ఇంటికి వెళ్లి పూజలు చేయడం ఏంటని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ పూజలు వెనుక అసలు కారణం ఇంకోటి ఉందట.

అదేంటంటే… నిహారిక విడాకుల అనంతరం.. వరుణ్, లావణ్య పెళ్లి క్యాన్సిల్ అయిందని వార్తలు వినిపించాయి. అలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారందరికీ స్ట్రాంగ్ కౌంట‌ర్‌ ఇచ్చేందుకే మెగా ఫ్యామిలీ ఇలా చేసిందట‌. అంతేకాకుండా ఒక్క పూజతో లావణ్య త్రిపాఠి మా ఇంటికి కోడలే అంటూ అఫీషియల్ గా ప్రకటించేశారు. దీంతో వీరిపై వచ్చే రూమర్స్ కు చెక్ పెట్టారు మెగా ఫ్యామిలీ.