మ‌హ‌ష్ బాబుతో వేణు స్వామికి లింకేంటి.. ఎవ‌రికీ తెలియ‌ని టాప్ సీక్రెట్ ఇది!

వేణు స్వామి.. ఈ మ‌ధ్య తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు. అడ‌గ‌క‌పోయినా సినీ తారల జాత‌కాలు చెబుతూ వేణు స్వామి బాగా పాపుల‌ర్ అయ్యారు. సెల‌బ్రిటీల పెళ్లిళ్లు, విడాకులు, స‌క్సెస్‌, ఫెయిల్యూర్ వంటి విష‌యాలే కాకుండా మ‌ర‌ణాల గురించి కూడా చెప్పేస్తున్నారీయ‌న‌. యాదృచ్ఛికంగా వేణు స్వామి చెప్పిన కొన్ని విష‌యాలు నిజం అవ్వ‌డంతో.. సెల‌బ్రిటీల్లో కొంత మంది ఆయ‌న్ను న‌మ్మ‌డం స్టార్ట్ చేశారు.

ర‌ష్మిక మంద‌న్నా, నిధి అగ‌ర్వాల్‌, డింపుల్ హ‌యాతి వంటి హీరోయిన్లు వేణు స్వామిని ఇంటికి పిలిపించుకుని ప్ర‌త్యేక‌మైన పూజాలు జ‌రిపించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, వేణు స్వామి ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో ఒక‌టి నెట్టింట చక్క‌ర్లు కొడుతోంది. అస‌లు మ‌హ‌ష్ బాబుతో వేణు స్వామికి లింకేంటి..? వీరిద్ద‌రూ ఎందుకు క‌లిశారు..? వంటి ఇంట్రెస్టింగ్ విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పైన క‌నిపిస్తున్న ఫోటో యువరాజు మూవీ షూటింగ్ సమయంలోది. ఈ సినిమాను వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వం వహించి నిర్మించాడు. ఇందులో మహేష్ బాబుకు జోడీగా సిమ్రాన్, సాక్షి శివానంద్ నటించారు. 2000వ సంవత్స‌రంగా విడుద‌లైన ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. హీరోగా మ‌హేష్ బాబు చేసిన రెండో సినిమా ఇది. అయితే ఈ మూవీ పూజాకార్యకరం నిర్వహించింది వేణు స్వామినే. అప్ప‌టి ఫోటోనే ఇప్పుడు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే ఈ పిక్ లో వేణు స్వామిను గుర్తించ‌డం క‌ష్ట‌మే. ఎందుకంటే, అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఆయ‌న చాలా మారిపోయారు.