కత్రీన ప్రెగ్నెంట్‌.. విక్కి కౌశ‌ల్ క్లారిటీ..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ – వికీ కౌశల్ 2021లో గ్రాండ్గా వివాహం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రిటీస్ అంతా ఓ బిడ్డకు తండ్రి కూడా అయిపోయారు. ఇక దీంతో తమ అభిమాన స్టార్స్‌ కత్రినా – విక్కి కౌశల్ ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెప్తారా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో విక్కి.. కత్రినాలకు తమ ఫ్యామిలీస్ నుంచి కూడా గుడ్ న్యూస్ కోసం ఒత్తిడి వస్తుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.

అంతేకాకుండా కత్రినా ప్రెగ్నెంట్ అయినట్లు కూడా నెట్టింట పుకార్లు వినిపించాయి. దీనిపై విక్కీ కౌశల్ తాజాగా స్పందించాడు. రేడియో సిటీ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ కి కౌశల్ మాట్లాడుతూ కత్రినాకైఫ్‌ కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తుంది అన్న విషయంపై స్పందించాడు. విక్కి మాట్లాడుతూ మొదట మా డేటింగ్ విషయం ఇంట్లో అమ్మా, నాన్నకు తెలిసింది వాళ్ళు చాలా హ్యాపీ అని చెప్పాడు.

ఇక మా నుంచి గుడ్ న్యూస్ కోసం ఇంట్లో నుంచి ఎలాంటి ఒత్తిడి రావడం లేదు.. వారు చాలా ప్రశాంతమైన వారు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో కత్రినా ప్రెగ్నెంట్ అనే న్యూస్ కూడా ఫేక్ అని క్లారిటీ వచ్చేసింది. ప్ర‌స్తుతం ఈ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.