బాక్సాఫీస్ వ‌ద్ద అనుష్క హ‌వా.. `మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి` 3 డేస్ క‌లెక్ష‌న్స్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే!

దాదాపు ఐదేళ్లు త‌ర్వాత అనుష్క శెట్టి మ‌ళ్లీ `మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి` మూవీతో వెండితెర‌పై మెరిసింది. ఇదొక రొమాంటిక్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్టైన‌ర్‌. ఇందులో యంగ్ అండ్ టాలెంటెడ్ స్టార్ న‌వీన్ పోలిశెట్టి హీరోగా న‌టించాడు. పి. మ‌హేష్ బాబు ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. యూవీ క్రియేష‌న్స్ వారు నిర్మించారు. సెప్టెంబ‌ర్ 7న థియేట‌ర్స్ లోకి వ‌చ్చిన మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి.. ప్రేక్ష‌కుల మెప్పు పొంది పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

టాక్ అనుకూలంగా ఉండ‌టంతో.. పోటీగా షారుఖ్ ఖాన్ జ‌వాన్ ఉన్నా స‌రే బాక్సాఫీస్ వ‌ద్ద అనుష్క హ‌వా చూపిస్తోంది. 3 రోజుల్లోనే అద్భుత‌మైన క‌లెక్ష‌న్స్ సాధించి అంద‌రికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. మొద‌టి రోజు రూ. 4 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి.. రెండు, మూడు రోజుల్లో రూ. 2 కోట్ల‌కు త‌గ్గ‌కుండా క‌లెక్ష‌న్స్ ను సొంతం చేసుకుంది.

మొత్తంగా మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రూ. 4.64 కోట్ల షేర్‌, రూ. 8.45 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను అందుకున్న ఈ చిత్రం.. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 8.84 కోట్లు షేర్‌, రూ. 17.20 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.50 కోట్లు కాగా.. మ‌రో రూ. 4.66 కోట్ల రేంజ్ లో షేర్ వ‌స్తే మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ అయిపోతుంది. ఇక ఏరియాల వారీగా ఈ సినిమా 3 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఈ విధంగా ఉన్నాయి..

నైజాం: 2.82 కోట్లు
సీడెడ్: 0.37 కోట్లు
ఆంధ్రా: 1.45 కోట్లు
——————–
ఏపీ+తెలంగాణ‌= 4.64కోట్లు(8.45కోట్లు~ గ్రాస్)
——————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 0.50 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 3.70 కోట్లు
——————–
వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్‌= 8.84కోట్లు(17.20కోట్లు~ గ్రాస్)
——————–