ఆమెతో పీక‌లోతు ప్రేమ‌లో ధ‌నుష్‌..!

తమిళ్ స్టార్ హీరో ధనుష్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లో కూడా ధనుష్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇటీవల హీరో ధనుష్ – రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా హీరో ధనుష్ ప్రేమలో పడ్డాడని బ‌జ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆ న్యూస్‌ నిజమే అనుకున్నేరు ఇది కేవ‌లం ఓ మూవీకి సంబందించిన న్యూస్‌. తమిళ్ స్టార్ హీరో ధనుష్, కియారా అద్వానీ హీరోయిన్గా ఆనంద్ ఎల్ రాయ్‌ దర్శకత్వంలో వస్తున్న బాలీవుడ్ మూవీ తేరే ఇష్క్ మే మూవీ పై వ‌చ్చిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతుండుదట.

రొమాంటిక్ డ్రామాగా నడిచే ఈ సినిమాలో కియారా అద్వానీతో.. ధనుష్ పీక‌లోతు ప్రేమలో మునిగితేలుతూ ఉంటాడని సమాచారం. నీరజ యాదవ్ కథా స్క్రీన్ ప్లే డైలాగులు అందిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి హిమాన్ శర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతుంది.