సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల గారాల పట్టి సితార ఇటీవల కాలంలో వార్తల్లో బాగా నిలుస్తోంది. ఈ స్టార్ కిడ్ డ్యాన్స్‌తో పాటు యాక్టింగ్‌లో కూడా మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తండ్రికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకుంటుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించింది సితార. ఈ చిన్నారిని తల్లి నమ్రత శిరోద్కర్ బాగా ఎంకరేజ్ చేస్తోంది. తనతో పాటు బయటికి తీసుకెళ్లడం ఇంకా అన్నింటా ఆమెకు సపోర్ట్ గా నిలవడం చేస్తోంది. తాజాగా నమ్రత సితారను తన వెంటబెట్టుకొని హైదరాబాద్‌లోని కోకాపేటలో ‘మిర్రర్ లగ్జరీ సెలూన్’ లాంచ్ ఈవెంట్ కి తీసుకెళ్లింది.
ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాశి ఖన్నా రాగా సినీ తారలు కూడా తళుక్కుమన్నారు. అయితే స్పెషల్ అట్రాక్షన్ గా నమ్రతాతో కలిసి వచ్చిన సితార నిలిచింది. ఆమెతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. మీడియా పర్సన్స్ తో సితార మాట్లాడింది. ఈ సెలూన్ తమకు ఒక ఫ్యామిలీ లాంటిదని అందరూ దీన్ని ఆదరించాలని చక్కగా చెప్పుకొచ్చింది. ఈ కార్యక్రమానికి ఈ చిన్నారి వేసుకొచ్చిన లైట్ పింక్ కలర్ డ్రెస్ ఆమె క్యూట్ నెస్ ని మరింత రెట్టింపు చేసింది. ఆ క్యూట్ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.
బార్బీగర్ల్‌గా, లేత గులాబీలా మెరిసిపోతూ ఉన్నావంటూ చాలామంది మహేష్ బాబు అభిమానులు సితూ బేబీ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మహేష్ అన్న లాగానే భలే క్యూట్ గా నవ్వుతున్నావు అంటూ పొగిడేస్తున్నారు. ఇకపోతే సితార ఒక జువెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా ఎంపిక అయింది. ఆ నగల సంస్థ జ్యువెలరీ ధరించి చేసిన యాడ్ వీడియోను టైమ్‌స్క్వేర్ పై కూడా ప్రదర్శించారు. ఆ విధంగా టైమ్ స్క్వేర్ పై మెరిసిన తొలి స్టార్ కిడ్‌గా సితార రికార్డు క్రియేట్ చేసింది.
డాన్స్ యాక్టింగ్ లోనే కాకుండా చాలా ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ లో సితార ముందుంటుంది. పెయింటింగ్, డ్రాయింగ్ వంటి వాటిలో ఆమె మంచి స్కిల్స్ కూడా అలవర్చుకుంది. మరి ఈ ఘట్టమనేని అమ్మాయి వెండితెరపై ఎప్పుడు మెరుస్తుందో చూడాలి.