ఈవెంట్లో బాయ్ ఫ్రెండ్‌తో క‌లిసి సంద‌డి చేసిన త‌మ‌న్న‌.. ఆమె డ్ర‌స్ ధ‌ర తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోది..!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ తమన్న ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా ఇంకా అదే క్రేజ్‌తో కొనసాగుతుంది. ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త హీరోయిన్లు వచ్చిన తన క్రేజ్‌ కోల్పోకుండా మంచి ఫామ్‌లో దూసుకుపోతుంది. తాజాగా చిరంజీవి భోళా శంకర్, రజనీకాంత్ జైలర్‌లో నటించిన తమన్నా భోళా శంకర్ తో ఫ్లాప్ ను సొంతం చేసుకున్నా జైలర్ తో డబల్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇటీవల దా లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌లో ప్రియుడు విజయ వర్మతో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

వీరిద్దరు ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో భాగంగా తమ ప్రేమను బయటకు చెప్పారు. తాజాగా వీరిద్దరూ కలిసి ముంబైలో ఓ ఈవెంట్‌లో పాల్గొని సందడి చేశారు. ఆ ఇవెంట్‌లో ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. బ్లూ కలర్ డ్రెస్ లో తమన్నా మెరిసిపోయింది. ఇంటర్నేషనల్ బ్రాండ్ లక్వన్ స్మిత్ డిజైన్ చేసిన ఆ డ్రస్ విలువ‌ దాదాపు $ 2.550 అంటే భారతీయ కరెన్సీలో రూ2,6,390 తెలుస్తుంది.

అయితే ఈ అవుట్ ఫిట్‌లో తమన్నా మరింత అందంగా కనిపించిన.. డ్రెస్ ధ‌ర తెలిసి నిడిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం తమన్న బాలీవుడ్ లో బోలే చుడియన్, మలయాళం లో అరుణ్ గోపి డైరెక్షన్లో బాంద్రా సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమా దివ్యభారతి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతుంది. అలాగే తమిళ్‌లో మరో రెండు ప్రాజెక్టులకు కమిట్ అయినట్టు సమాచారం. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంది తమన్నా.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)