చంద్రబాబు అరెస్టు నిర్మాతల గుండెల్లో గుబులు.. కారణం ఇదే..!

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో వరుస సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల వారాహి యాత్రను పూర్తిచేసుకుని ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్లోకి అడుగుపెడుతున్నాడు పవన్ కళ్యాణ్. అయితే నిన్న ఉదయం మాజీ ముఖ్యమంత్రి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్టు అయిన సంగతి తెలియడంతో తెలుగు నాట అలజడి రేగింది. బాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు మద్దతుగా నిలిచాడు. ఈ సంఘ‌ట‌న‌తో మ‌ళ్ళీ ప‌వ‌న్‌ రాజకీయాల వైపు వెళ్తాడు ఏమో అని అనుమానం నిర్మాతలలో మొదలైంది.ల‌

వారాహి యాత్రలో ఒక దశ వరకు పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి సినిమాలకు కాల్‌షీట్‌లు కేటాయించాడు. ముందుగా ఉస్తాద్‌ భగత్ సింగ్ సెట్స్‌ పైకి వచ్చాడు. ఈ సినిమా కొత్త స్కెడ్యూల్ ప్రారంభమై 24 గంటలు కూడా పూర్తి కాలేదు. ఆ సినిమా యూనిట్కి టెన్షన్ పట్టుకుంది. పవన్ షూటింగ్ కు వస్తాడో.. లేదో.. అని సందిగ్ధతతో నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మాత్రమే కాదు ఈ మూవీ తర్వాత ఓజి సినిమాకు కూడా పవన్ కాల్ షీట్లు ఇచ్చాడు. ఈ సినిమాకు 50 శాతం షూటింగ్ పూర్తయింది. పవన్ వస్తే మరో 30% కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారు మూవీ టీం.

అలాగే హరిహర వీరమల్లు సినిమా సంగతి చెప్పనవసరం లేదు.. కొన్ని నెలలుగా వీళ్ళు చకోర పక్షుల ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇక ఈ సినిమాల నిర్మాతలు అందరికీ చంద్రబాబు అరెస్ట్ తో టెన్షన్ స్టార్ట్ అయింది. ఏదైనా ఘటన జరిగితే ప్రెస్ నోట్ తో సరిపెట్టే పవన్ కళ్యాణ్ ఇది సాధారణ ఘటన కాదు చంద్రబాబు అరెస్ట్ కాబట్టి ఏదో ఒకటి చేయాల్సిందే తన దత్తతండ్రిపై ప్రేమను చాటుకోవాల్సిందే అనే విధంగా ఒక కార్యచరణ సిద్ధం చేసుకునే ఉంటాడు.. అది అమల్లోకి వస్తే అతడికి సినిమాలు చేసే అంత ఖాళీ కూడా ఉండదు మరోసారి నిర్మాతలు ఎవరి ఇళ్లల్లో వాళ్ళు కూర్చోవాల్సిందే అని టెన్ష‌న్ మొద‌లైంద‌ట‌.