అనంతగిరి హిల్స్ వ‌ద్ద ఘోర కారు ప్రమాదం.. ఇద్దరు ఇంజ‌నీరింగ్ విద్యార్ధులు మృతి…!!

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అలూర్ స్టేజ్ వద్ద వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు యువ‌కులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్లతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కి తరలించారు.

వీరు వికారాబాద్ లోని అనంతగిరి హిల్స్ విహార యాత్రకి వెళ్లి వస్తుండగా తెల‌వారుజామున‌ ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఉన్న వారంతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గా గుర్తించారు. మృతులు ప్రదీప్, సోనీలుగా గుర్తించారు.

అలాగే ఆర్య, కాంత్రి అనే ఇద్ద‌రు విద్యార్థులు తీవ్రంగ‌ గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతి వేగం కార‌ణంగానే ఈ ఘోర సంఘ‌ట‌న చోటు చేసుకుంది దీంతో ఇప్ప‌టికైన వాహ‌న‌దారులు డ్రైవింగ్ విష‌యంలో త‌గ్గిన జాగ్ర‌త‌లు తీసుకోవ‌టం మంచిది.