సైమా అవార్డ్స్ లో ఎన్టీఆర్ ను అలా పిలిచిన అనన్య నాగళ్ల.. శ్రీలీల కూడా షాక్..ముందుగానే బంధం ఫిక్స్ చేసేసుకుందా..?

ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ హీరోలు కనిపించగానే హగ్ చేసుకుని..షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు . మరీ క్లోజ్ అయిపోతే ఏకంగా ముద్దులు కూడా పెడుతూ ఉంటారు . ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. కానీ ఓ హీరోయిన్ మాత్రం హీరో కనపడగానే ఎంతో ప్రేమగా ఆప్యాయంగా అన్నా అంటూ పలకరించచింది. అంతేకాదు హగ్గులు ..షేక్ హ్యాండ్ లు కాకుండా చేతులు పైకెత్తి నమస్కరించింది.

దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు అనన్య నాగళ్ల. ఈ బ్యూటీ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో నిరంతరం ఫోటోషూట్స్ చేస్తూ పలు అవకాశాలతో మంచి పేరే మూటకట్టుకునింది . సైమ అవార్డ్స్ వేడుకల్లో ఎన్టీఆర్ ని అనన్య నాగళ్ల.. అన్నా అంటూ ప్రేమగా ఆప్యాయంగా పిలిచి పలకరించింది.

అంతేకాదు నమస్కరించి ఆయనపై ఉన్న గౌరవాన్ని మరోసారి రుజువు చేసుకుంది. దీంతో సోషల్ మీడియాలో అనన్య నాగళ్ల చేసిన పనికి ఫిదా అయిపోతున్నారు జనాలు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే అనన్య నాగళ్ల వినయానికి ప్రశంసలు కురిపిస్తున్నారు . అనన్య అందాలు చూసి శ్రీలీల కూడా షాక్ అయిపోయింది అయితే సైమా అవార్డ్స్ లో ఆమె వేసుకున్న డ్రెస్ మాత్రం కూసింత హాట్ గా ఉండడమే కాకుండా ఇబ్బందికరంగా కూడా ఉంది అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి..!!