రోజు వేడి నీటితో స్నానం చేస్తున్నారా.. అయితే ఇవి ఖ‌చ్చితంగా తెలుసుకోండి..!

వేడి నీటితో స్నానం చేస్తే ప్రాణం ఎంత హాయిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది రోజు స్నానం చేయాలంటే వేడి నీటికి అలవాటు పడిపోయి ఉంటారు. అయితే కొంతమంది రోజు వేడి నీటితో స్నానం చేయడం మంచిది కాదు అంటూ ఉంటారు. చనిటి స్నానమే మంచిది అని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఆ ప్రయోజనాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఇటీవల కాలంలో నిద్రలేమి సమస్య చాలా మందిని వేధిస్తుంది ఇలాంటి వారికి పడుకుందామన్న నిద్ర రాదు.

అలాంటి సమస్య ఉన్నప్పుడు పడుకునే ముందు వేడి వేడి నీటితో స్నానం చేస్తే మంచిగా నిద్ర పడుతుంది. అలాగే మిగిలిన వాళ్ళతో పోల్చితే వేడి నీటి స్నానం చేసేవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే వేడి నీటి స్నానం గుండెకు సరైన రక్త ప్రసరణ అందించి దాని పనితీరును మెరుగుపరుస్తుందట. తద్వారా గుండెపోటు ఇతర గుండెజబ్బులు కూడా రావు. ఇక నేటి కాలంలో ఎక్కువ శాతం మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయట పడేందుకు చెమటలుచిదేల వ్యాయామాలు చేస్తుంటారు. అయితే వేడి నీటితో స్నానం కూడా బరువుని అదుపులోకి తీసుకువస్తుందట.

వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో వేడి పుట్టే అదనపు క్యాలరీలు కరుగుతాయి. అయితే వేడి నీటి స్నానం చేసినప్పుడు కూడా శరీరంలో బేడి పెరిగి బరువు తగ్గేలా చేస్తుంది. అలాగే ప్రతిరోజు వేడి నీటితో స్నానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తలనొప్పి పోయి మైండ్ రిఫ్రిష్ అవుతుంది. వేడి నీటి స్నానం వల్ల మరో ప్రయోజనం ఏంటంటే రోజు మొత్తం పనిచేసే టైడ్ అయిపోయే వారు వేడి నీటితో స్నానం చేస్తే కండరాలు బాగా రిలాక్స్ అవడంతో పాటు శరీరానికి మళ్లీ ఫ్రెష్ ఎనర్జీ వస్తుంది అయితే మంచిది కదా అని బాగా మరిగే నీటిని స్నానం చేయకూడదు.. ఓ మాదిరి వేడి నీటిలో మాత్రమే స్నానం చేయాలట.