బాలయ్య సినిమాలో పాన్ ఇండియా బ్యూటీ.. ముసలోల్లకి దసర పండగ అంటే ఇదే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోల సరసన యంగ్ బ్యూటీస్ ఎక్కువగా కనిపిస్తున్నారు నటిస్తున్నారు. మొన్నటికి మొన్న చిరంజీవి – బాలకృష్ణ తన కూతురు వయసు ఉన్నంత హీరోయిన్ శృతిహాసన్ తో రొమాన్స్ చేసి హిట్ కొట్టారు . అంతేకాదు ప్రెసెంట్ మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

మృణాల్ కి కూడా ఇంచుమించు చిరంజీవి కూతురు వయసే ఉంటుంది . మరి అలాంటి హీరోయిన్ తో ఎలా రొమాన్స్ చేస్తావు బాసు అంటూ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు . సరిగ్గా ఇదే టైంలో డైరెక్టర్ బాబి కూడా బాలయ్య కోసం యంగ్ బ్యూటీనే చూస్ చేసుకున్నారు . కే జి ఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మారిన శ్రీనిధి శెట్టిని బాలయ్య సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకున్నారట బాబి . ఇదే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

 

బాలకృష్ణ ఏజ్ కి శ్రీనిధి శెట్టి ఏజ్ కి చాలా గ్యాప్ ఉంది . అయితే ఎందుకు బాబి ఇలాంటి ఓ చెత్త కాంబో ని సెట్ చేస్తున్నాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ ఈ కాంబోపై ఫుల్ గుర్రుగా ఉన్నారు. చాలామంది బ్యూటీస్ ఉన్నారుగా వేరే బ్యూటీని చూస్ చేసుకోవచ్చుగా అంటూ సజెస్ట్ చేస్తున్నారు . కొంతమంది ముసలోళ్ళకి దసరా పండుగ అంటే ఇదే.. సీనియర్ హీరోస్ సరసన యంగ్ బ్యూటీస్ నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . ఇక యంగ్ హీరో సినిమాలో ఎవరు నటిస్తారు అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి యంగ్ హీరోస్ కన్నా సీనియర్ హీరోస్ తో చేస్తేనే క్రేజ్ వస్తుంది అనుకున్నారో ఏమో ఈ హీరోయిన్స్ డైరెక్టర్ లు అడిగి అడగగానే ఓకే చేసేస్తున్నారు..!!