బిగ్ బాస్ -7 ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చేసిన సురేఖ వాణి..!!

తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో నటి సురేఖ వాణి కూడా ఒకరు.. ఈ మధ్యకాలంలో సినిమాలలో కంటే ఈమె సోషల్ మీడియాలోనే తరచూ యాక్టివ్ గా ఉంటూ తన కూతురుతో కలిసి పలు రకాల వీడియోలు గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంది.. అప్పుడప్పుడు ఈ తల్లి కూతుర్లు చేసే రచ్చ గురించి హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో మారుతూనే ఉంటుంది.. ముఖ్యంగా గడిచిన కొద్ది రోజుల నుంచి బిగ్ బాస్ -7 లో వెళ్లబోతున్నట్లు వార్తలు వినిపించాయి.. ఈ మేరకు ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తమకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందన్న వాస్తవాన్ని కొట్టిపారేసినప్పటికీ హౌస్ లోకి ప్రవేశించిన తర్వాత తమకు ఎలాంటి ఇమేజ్ వస్తుందో అంటూ చాలా ఆందోళనకు గురయ్యామని తెలియజేశారు.. ఈ రియాలిటీ షో చేసిన తర్వాత సెలెబ్రేటిల చుట్టూ చాలా నెగిటివిటీ వస్తుందని అందుకే ఇలాంటి షో నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నామని తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. సెప్టెంబర్-3 నుంచి ఇ రియాల్టీ షో ప్రారంభం కాబోతోంది..

గత కొద్ది రోజులుగా కంటిస్టేట్లో పేరు మాత్రం సోషల్ మీడియాలో పదుల సంఖ్యలో వైరల్ గా మారుతోంది.. అందులో సురేఖ వాణి తన కూతురు సుప్రీత పేరు కూడా వినిపించాయి.. తాజాగా ఈ తల్లి కూతుర్లు బిగ్ బాస్ ఎంట్రీ పైన మాట్లాడుతూ అవన్నీ ఒట్టి రూమర్లు ఇలాంటివి సాధ్యం కాదు గతంలో కూడా ఇలాంటివి చాలానే వినిపించాయి అంటూ ఈ వార్తలను ఖండించారు. ముఖ్యంగా గతంలో యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ లో పాల్గొనింది తనతో పాటు పలువురు యాంకర్లు పాల్గొని సందడి చేశారు.. కానీ శ్రీముఖి చుట్టూ కూడా చాలా నెగెటివిటీ ఏర్పడింది.. అందుకే సురేఖ వాణి తన కూతురు కూడా ఇలాంటి షోలకు దూరంగా ఉండాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం.