బరితెగించిన పూజ హెగ్డే….కొత్త సోషల్ మీడియా స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేనా?

గడిచిన ఐదారేళ్ళ తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజ హెగ్డే. “ఒక లైలా కోసం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముంబై భామ, తరువాత వరుస వకాశాలతో దూసుకుపోయింది. మహేష్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి అభిమానులను సొంతం చేసుకుంది. ఐతే కారొనకు ముందు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్న ఈమె కెరీర్, కరోనా తరువాత మాత్రం పెద్ద మలుపు తిరిగింది. కరోనా తరువాత ఈమె నటించిన చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలాయి.

ప్రభాస్ తో చేసిన “రాధే శ్యామ్”, చిరంజీవి చిత్రం “ఆచార్య”, వెంకటేష్ వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ “ఎఫ్ త్రీ” వంటి మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. బాలీవుడ్లో కూడె ఇదే పరిస్థితి. పూజ సల్మాన్ తో కలిసి నటించిన “కిసి కా భాయ్ కిసి కా జాన్”, రణ్వీర్ సింగ్ “సర్కస్” చిత్రాలు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీంతో ఈ అమ్మడుకి ఇప్పుడు ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. ఇప్పుడు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. తాజాగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో లో వస్తున్నా గుంటూరు కారం చిత్రం నుంచి కూడా పూజ తప్పుకున్న విషయం మనందరికీ తెలిసినదే. కెరీర్ డౌన్ ఫాల్ అవుతున్న ఈ సమయంలో పూజ సోషల్ మీడియా స్టాటజీని ఫాలో అవుతుంది.

తాజాగా పూజ హెగ్డే తన ఇంస్టాగ్రామ్ హేండిల్ ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో పూజ వస్త్రధారణ కాస్త హద్దు దాటినట్టుగా ఉంది. ఈ వీడియోలో పూజ హెగ్డే బీచ్ లో బికినీ వేసుకొని నడుస్తూ కనిపిస్తుంది. ఈ వీడియోలో ఆమె తొడలు, యెడ అందాలు హైలైట్ అవుతున్నాయి. పూజ ఇంత దారుణంగా ఎక్సపోజ్ చేస్తున్నప్పటికీ తన పోస్ట్ కు పెద్దగా ఆదరణ లభించడంలేదు. ఇంతకుముందులా లైక్లు, షేర్లు, కామెంట్లు రావడం లేదు. ఆమె నటించిన భారీ బడ్జెట్ సినిమాలన్నీ వరుసగా ప్లాప్ లు అవ్వడమే దీనికి కారణం. ఇప్పుడు పూజ పరిస్థితి చూస్తుంటే ఆమె డౌన్ ఫాల్ మొదలైనట్టే అనిపిస్తుంది.