చిరు – సురేఖ పెళ్లి వెనుక ఇంత కథ నడిచిందా.. రివీల్ అయిన సీక్రెట్..!

మెగాస్టార్ చిరంజీవి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఇప్పటికీ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సీనియర్ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం ఆడారు. చిరు, సురేఖ పెళ్లి సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇటీవ‌ల‌ అల్లు అరవింద గుర్తుతెచ్చుకున్నాడు. ఇంతకీ చిరంజీవి పెళ్లి సమయంలో ఏం జరిగింది. ఆ విషయానికి వస్తే అల్లు అరవింద్ మాట్లాడుతూ మొదటిసారి చిరంజీవిని ప్రాణం ఖరీదు సినిమా ప్రివ్యూ లో చూశాను.

అప్పటికే ఆయనను సినిమాల్లో చూసి ఉన్నాను కాబట్టి ఈ యువకుడు ఎవరో కానీ బాగా చేశాడు అనుకున్నాను. అదే తొలి ఇంప్రెషన్. సోదరి సురేఖకి చిరంజీవి ఎలా ఉంటాడని అల్లు రామలింగయ్య ఇంటిలో ప్రశ్నించాడు. ఈ విష‌యంపై డిస్కషన్ పెట్టినప్పుడు మనం సినిమా పరిశ్రమలోనే ఉంటూ సినిమా పరిశ్రమలో ఉన్నవాడికి చెల్లిని ఇవ్వవచ్చా అని చర్చ అనవసరం. అబ్బాయి మంచివాడని ఎవరైనా చెప్పితే చాలని అన్నకున్నార‌ట కుటుంబ స‌భ్యులు.

సురేఖ చిరంజీవిని అప్ప‌టికే మనఊరి పాండవులు ప్రివ్యూ వేసినప్పుడు, తాయారమ్మ – బంగారయ్య సతదినోత్సవ వేడుకల్లో చూసి ఉండడంతో ఆమె కూడా ఓకే చెప్పేసింది. దాంతో చిరు, సురేఖ వివాహం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగింది. 1980 ఫిబ్రవరి 20న మద్రాస్ లో వీరి వివాహం జరిగింది. ఆ విధంగా ఆనాటి సంఘటనలు అల్లు అరవింద్ గుర్తుతెచ్చుకున్నాడు. చిరంజీవి, సురేఖ దంపతులకు రామ్ చరణ్, శ్రీజ, సుస్మిత జన్మించారు. రామ్ చరణ్ సినీ పరిశ్రమలో హీరోగా, నిర్మాతగా కొనసాగుతున్నాడు. సుస్మిత కూడా సినీ రంగంలోనే రాణిస్తుంది.