రాజమౌళికి ఆ స్టార్ హీరోతో ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీనీ ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి.. ఈయన మగధీర, ఈగ, బాహుబలి లాంటి బిగ్గెస్ట్ చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.. ఈ మధ్యనే ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నాడు. వందల కోట్ల బడ్జెట్లో సినిమాలు చేయటంతో పాటు ఆ సినిమాలు వేల కోట్ల రూపాయలను కలెక్షన్ చేయటం ఒక రాజమౌళితే సొంతం అనే చెప్ప వచ్చు. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ , హాలివుడ్ తారలు సైతం ఆయనతో సినిమాలు చేయాలని చెప్పుకునే రేంజ్ రాజమౌళి ఎదిగాడు.

Rajamouli's son to marry Jagapathi Babu's niece | Rajamouli son engagement  | Rajamouli son marriage

ఇదిలా ఉంటే రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా నిర్మాతగా సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఇప్పటికే కార్తికేయ ఆకాశవాణి అనే సినిమాను నిర్మించడం జరిగింది. ఇదిలా ఉండగా కార్తికేయ గతే ఎడాది వివాహం కూడా చేసుకున్నారు..తన స్నేహితురాలు కార్తికేయ వివాహం చేసుకోగా వీరి వివాహానికి తెలుగు ప్రముఖులు హాజరయ్యారు.. అయితే పూజా ప్రసాద్ మరెవ్వరూ కాదు.

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి నుంచి ఇప్పటివరకు ఓ వెలుగు వెలుగుతున్న నటుడు ఇప్పుడు విలన్ గా ఇండస్ట్రీలో రాజ్యమేలుతున్నా నటుడు జగపతిబాబు జగపతిబాబు మేనకోడలు పూజా ప్రసాద్ ఈమె సింగర్ కావటం విశేషం.. అయితే ఈ విషయం ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ప్రస్తుతం కార్తికేయ, రాజమౌళి చేస్తున్న సినిమాలకు సంబంధించిన పనులను కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు.

రాజమౌళి తీసే సినిమాలలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దానికి కారణం కథ ఎంచుకునే విషయం అలాగే హీరో హీరోయిన్స్ ఎంపిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఎంచుకోవటమే ఆయన ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు .