గుండు బాస్‌లా ద‌ర్శ‌న‌మిచ్చిన స‌ల్మాన్ ఖాన్‌.. బాబోయ్ ఇలా ఉన్నాడేంట్రా!(వీడియో)

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కు ఉన్న క్రేజ్‌, ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆరు పదుల వ‌య‌సుకు చేర‌వుతున్నా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. నిర్మాత‌గా, వ్యాపార‌వేత్త‌గా, హోస్ట్ గా కూడా రాణిస్తున్నారు. ప్ర‌స్తుతం మనీష్ శర్మ దర్శకత్వంలో `టైగ‌ర్ 3` మూవీ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. స‌ల్మాన్ ఖాన్ కు సంబంధించిన ఓ వీడియో నేటి ఉద‌యం నుండి నెట్టింట తెగ‌ చక్క‌ర్లు కొడుతోంది.

అందులో స‌ల్మాన్ ఖాన్ లుక్స్ చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎందుకంటే, ఎప్పుడూ చాలా హ్యాండ్స‌మ్ గా క‌నిపించే సల్మాన్‌.. తాజాగా గుండు బాస్ లా ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఆదివారం రాత్రి ముంబైలో ఓ ప్రైవేట్ పార్టీకి సల్మాన్ ఖాన్ హాజ‌రు అయ్యాడు. బ్లాక్ ష‌ర్ట్‌, మ్యాచింగ్ ప్యాంటు ధ‌రించిన స‌ల్మాన్‌.. గుండుతో క‌నిపించాడు.

పైగా ఈ గుండు లుక్ లో స‌ల్మాన్ ఖాన్ కు బ‌ట్ట‌త‌ల ఉంద‌న్న విష‌యం పూర్తిగా స్ప‌ష్ట‌మైంది. దీంతో ఆయ‌న గుండు లుక్‌ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి సొంత ఫ్యాన్సే షాకైపోతున్నారు. బాబోయ్ స‌ల్మాన్ ఖాన్ ఇలా ఉన్నాడేంట్రా అంటూ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. అయితే ఇది ఓ సినిమా కోసం చేసుకున్న లుక్ అని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఏది నిజమో.. ఏది అబ‌ద్ధ‌మో తెలియాల్సి ఉంది.