143 మూవీ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడెంత హాట్ గా త‌యారైందో చూస్తే షాకైపోతారు!

యూత్ ఫేవ‌రెట్ మూవీస్ లిస్ట్ తీస్తే ఇప్ప‌టికీ అందులో 143 సినిమా ఉంటుంది. పూరీ జగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో ఆయ‌న త‌మ్ముడు సాయిరామ్‌ శంకర్, సమీక్ష సింగ్ జంట‌గా న‌టించారు. వీరిద్ద‌రికీ ఇది డెబ్యూ మూవీ ఇది. అయినా కూడా అద్భుతంగా న‌టించారు. 2004లో విడుద‌లైన ఈ చిత్రం అప్ప‌ట్లో మంచి విజ‌యం సాధించింది. ముఖ్యంగా యువ‌త ఈ సినిమాకు బాగా క‌నెక్ట్ అయ్యారు.

అయితే ఇందులో హీరోయిన్ గా న‌టించిన స‌మీక్ష సింగ్ మీకు గుర్తుందా..? 143లో ఎంతో అమాయ‌కంగా న‌టించిన ఆమె ఇప్పుడెంత హాట్ గా త‌యారైందో చూస్తే షాకైపోతారు. చండీగఢ్‌లో జ‌న్మించిన స‌మీక్ష సింగ్‌.. 143 త‌ర్వాత బ్రహ్మానందం డ్రామా కంపెనీ, సామ్రాజ్యం, దడ, కులుమనాలి త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. తమిళం, పంజాబీ, హిందీ, కన్నడ భాష‌ల్లోనూ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసింది.

ప‌లు టీవీ కార్య‌క్ర‌మాల్లోనూ సంద‌డి చేసింది. 2020 జూలైలో సింగపూర్‌లో గాయకుడు షైల్ ఓస్వాల్‌ను స‌మీక్ష సింగ్ వివాహం చేసుకుంది. ఈ దంప‌తుల‌కు ఒక కుమారుడు జ‌న్మించాడు. వివాహం త‌ర్వాత స‌మీక్ష‌ వెండితెర‌పై క‌నిపించ‌లేదు. అయితే న‌ట‌న‌కు దూర‌మైనా సోష‌ల్ మీడియాలో స‌మీక్ష సూప‌ర్ యాక్టివ్ గా ఉంటుంది. త‌ర‌చూ త‌న‌కు సంబంధించిన ఫోటోల‌ను ఆమె ఇన్‌స్టా ద్వారా పంచుకుంటూ ఉంటుంది. పెళ్లై ఒక బిడ్డ‌కు త‌ల్లైనా కూడా ఆమె అందం ఏ మాత్రం చెక్కుచెద‌రలేదు అని చెప్ప‌డానికి ఆమె తాజా ఫోటోలే నిద‌ర్శ‌నం. మ‌రి వాటిపై మీరు లుక్కేసేయండి.

 

View this post on Instagram

 

A post shared by Samiksha Shael Oswal (@iamsameksha)