ఎన్టీఆర్‌పై కోపంతో పుట్టింటికి వెళ్లిపోయిన లక్ష్మీ ప్రణతి.. వారి మధ్య అంత గొడవ జరిగిందా..?

టాలీవుడ్ లో నేటితరం స్టార్ హీరోలలో విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అని లిస్టు తీస్తే ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉంటాడు. మీసాలు కూడా రాని చిన్న వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. చిన్న వయసులోనే కనివిని ఎరగని రేంజ్ బ్లాక్ బస్టర్ ని కొట్టి ఇండస్ట్రీలోకి వచ్చి మూడేళ్లలోనే తిరుగులేకుండా మాస్ హీరోగా ఎదిగాడు. చిన్నతనంలోనే మాస్ ఇమేజ్ రావడంతో ఎలాంటి స్క్రిప్ట్‌ను ఎంచుకోవాలో ఆయనకి అర్థమయ్యేది కాదట‌.

దీనివల్ల చాలా కాలం ఫ్లాప్స్‌ని ఎదుర్కొన్నాడు. కానీ తాను ఎక్కడ విఫలం అవుతున్నాడో తెలుసుకుని మళ్లీ నెంబర్ 1 ప్లేస్ లోకి వచ్చాడు. ఇదిలా ఉండగా ఆయన 2011 లో లక్ష్మీ ప్రణతి నీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు వీళ్ళిద్దరికీ పెళ్లి అయ్యి 12 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ 12 ఏళ్ల నుంచి వీళ్లిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు. వీళ్ళకి అభయ్ రామ్, తారక్ రామ్ అనే ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు. ఈ జంట‌ సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు.

ఇదిలా ఉంటే లక్ష్మీ ప్రణతికి ఎన్టీఆర్‌లోని ఒక ముఖ్యమైన క్వాలిటీ అసలు ఇష్టం ఉండదట. ప్రతి చిన్న విషయానికి ఎన్టీఆర్‌కి కోపం వస్తుందని, ఈ హైపర్ అంటే లక్ష్మీ ప్రణతికి చాలా చిరాకు అని తెలుస్తుంది. కొన్ని కొన్ని సార్లు గొడవలు అయినప్పుడు ఆమె తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోయేదట. ఎన్టీఆర్ లో ఉన్న కోపంతో లక్ష్మీ ప్రణతి చాలా బాధపడేదని అప్పట్లో టాక్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.