రజనీకాంత్ జైలర్ మూవీ రివ్యూ.. తలైవా సక్సెస్ కొట్టినట్టేనా..?

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా ఇందులో తమన్నా హీరోయిన్గా , రమ్యకృష్ణ సునీల్ తదితరుల సైతం కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రంలోని పాటలు ట్రైలర్ భారీగా అంచనాలను పెంచేసాయి.. ముఖ్యంగా తమన్నా గ్లామర్ ఈ సినిమాకి కాస్త ప్లస్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఓవరాల్ గా ఈ సినిమా టాక్ ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

.

జైలర్ సినిమా పూర్తిగా వినోద చిత్రమన్నట్లుగా తెలుస్తోంది. మొదటి భాగంలో యోగి బాబు రజనీకాంత్ కాంబినేషన్ అదిరిపోయేలా ఉందని ఇంటర్వెల్ యాక్షన్ సన్నివేశాలు కూడా రజనీకాంత్ ఇరగ తీసేసారని సెకండ్ హాఫ్ లో కొంతమంది స్పెషల్ ఎంట్రీలతో ఈ సినిమా మరింత హైలెట్గా నిలిచిందని పలువురు ప్రేక్షకులు ట్విట్టర్ రూపంలో తెలియజేస్తున్నారు. సూపర్ స్టార్ అంటే కేవలం రజినీకాంత్ మాత్రమే అన్నట్లుగా తెలియజేస్తున్నారు. మళ్లీ సింహాసనం సొంతం చేసుకున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

జైలర్ సినిమా అదిరిపోయే ఎక్స్ట్రాడారి విజువల్స్ తో పాటు సినిమాలోని సన్నివేశాలు కూడా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని డైరెక్టర్ నెల్సన్ ఒక మంచి చిత్రాన్ని రజనీకాంత్ అభిమానులకు ఇచ్చారని కామెంట్లు వినిపిస్తున్నాయి.జైలర్ సినిమాతో హ్యాపీగా ఉన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. జైలర్ మూవీలో రజనీకాంత్ స్టైల్ అదిరిపోయిందని ప్రపంచమంతా ఒకే థియేటర్ గా మారిపోతుందని ఈరోజు రజినీకాంత్ అభిమానులు పండుగ వాతావరణ అంటూ నేటిజన్ కామెంట్స్ చేస్తున్నారు.

 

జైలర్ సినిమా 168 నిమిషాల నిడివి ఉందని తెలుస్తోంది ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో అంటూ రజిని ఫాన్స్ థియేటర్ వద్ద నానా హంగామా చేస్తున్నారు. పలు సిటీలలో ఇప్పటికే హాలిడేలు కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.