అన‌సూయ‌తో గొడ‌వ‌.. ఖుషి వేదిక‌గా కౌంట‌ర్ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ – అనసూయ మధ్య వివాదం నడుస్తున్నట్టు సోషల్ మీడియాలో పుంకాను పుంకాలుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఏడాది విజయ్ హీరోగా వచ్చిన లైజర్ సినిమా డిజాస్టర్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిన రెండో రోజు అనసూయ దీనిపై పరోక్షంగా ట్వీట్ పెట్టి పెద్ద రచ్చ చేసింది. దీనితో రెచ్చిపోయిన విజయ్ అభిమానులు అనసూయను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఆడుకోవడం మొదలుపెట్టారు.

Anasuya Bharadwaj decided to put an end to controversy with Vijay  Deverakonda

అనసూయ హాట్ గా కనిపించే ఫోటోలు పెడుతూ ఘోరమైన కామెంట్లు చేశారు. దీంతో చాలా నెలలపాటు అనసూయ వర్సెస్ విజయ ఫ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడిచింది. విజయ్ ఫ్యాన్స్ ఎంత రెచ్చ కొడుతున్న అనసూయ ఎక్కడా తగ్గలేదు. విచిత్రం ఏంటంటే అదే అనసూయ రీసెంట్గా వచ్చిన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ బేబీ సినిమాపై ప్రశంసలు కురిపించింది.

తాజాగా విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో విజయ్ దేవరకొండ ను ఓ మీడియా ప్రతినిధి అనసూయతో అసలు గొడవ ఏంటి ? దీనికి ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుంది అంటూ ప్రశ్నించాడు. దీనిపై విజయ్ సమాధానం ఇస్తూ మీరు గొడవపడే వాళ్ళని అడగాలి సోషల్ మీడియాలో ఏం నడుస్తుందో నాకు తెలియదు అంటూ సింపుల్గా చెప్పుకొచ్చాడు. విజయ్ ఆన్సర్ చేసిన దానిని బట్టి అనసూయదే తప్పు అంత అని క్లారిటీగా చెప్పాడన్న కొత్త చర్చ మొదలైంది.