చిరు టార్గెట్‌గానే వైసీపీ..నాగబాబు కౌంటర్..పవన్ రెడీ.!

జగన్‌ని గాని, ప్రభుత్వాన్ని గాని విమర్శిస్తే వైసీపీ నేతల ఎదురుదాడి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ప్రజలకు ఎన్నో మంచి పథకాలు ఇస్తూ అండగా ఉంటున్న జగన్ పై విమర్శలు చేస్తే వైసీపీ నేతలు ఊరుకునే పరిస్తితి లేదు. వెంటనే మీడియా సమావేశాలు పెట్టి విరుచుకుపడతారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టారు. ఇక ఎప్పుడు విమర్శలు చేసే చంద్రబాబు, పవన్, లోకేష్‌లని ఏ రేంజ్ లో తిడతారో చెప్పాల్సిన పని లేదు.

ఈ మధ్య బి‌జే‌పి అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆమెపై కూడా వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇక రాజకీయాలతో సంబంధం లేని వారు పొరపాటున ఏదైనా అంశంపై ప్రశ్నించిన ఊరుకునే పరిస్తితి లేదు. తాజాగా చిరంజీవి..సినిమా ఇండస్ట్రీపై పడకుండా..ప్రత్యేక హోదా, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లాంటి కార్యక్రమాలు, రోడ్లు బాగుచేయడం లాంటివి చేయవచ్చు కదా అని ఓ ఫంక్షన్ లో కామెంట్ చేశారు.

అంటే పదే పదే పవన్ బ్రో సినిమాపై వైసీపీ నేతలు కామెంట్ చేస్తున్న నేపథ్యంలో సినిమాలపై పడవద్దని, పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకని అన్నారు. ఇంకా అంతే చిరంజీవిపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రతి పకోడీ గాడు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడమే అని కొడాలి నాని పరోక్షంగా చిరుకు కౌంటర్ ఇచ్చారు. వరుసగా పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, రోజా ప్రెస్ మీట్లు పెట్టడం చిరంజీవిని తిట్టడం చేశారు.

ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు..వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. “ ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే అది మీ ముఖం మీదే పడుతుందని, మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన ఉండదు.. అభివృద్ధి అనేపదానికి అర్థం తెలీదు” అంటూ ట్వీట్ చేశారు. ఇక విశాఖలో పవన్ వారాహి యాత్ర మొదలవుతుంది. మరి పవన్ ఏ స్థాయిలో వైసీపీపై విరుచుకుపడతారో చూడాలి.