తల్లిదండ్రులు కాబోతున్న మంచు మనోజ్-భూమా మౌనిక..?

టాలీవుడ్ లో మంచు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ ఈ ఏడాది మార్చి-3 న భూమా మౌనికను వివాహం చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోని భూమా మౌనిక గర్భవతి అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. గతంలో భూమా మౌనికకు తన మొదటి భర్తతో ఒక అబ్బాయి అయితే జన్మించారు. అయితే మనోజ్ను వివాహం చేసుకున్నాక మనోజ్ వద్దని అబ్బాయి కూడా పెరుగుతున్నాడు. అయినప్పటికీ కూడా మౌనికతో మరొక బిడ్డను ప్లాన్ చేశారు అనే సందేహాలు వినిపిస్తూ ఉన్నాయి.

What did Manchu Manoj say about his divorce after marrying Bhuma Mounika Reddy? | PINKVILLA

మనోజ్ మొదటి భార్యకు సంతానం లేదు 2019లో ఆమెతో విడిపోవడం జరిగింది కాగా..రెండవ భార్య అయినా మౌనిక తాజాగా ప్రెగ్నెంట్ అనే వార్తలు తాలీవుడ్లో వినిపిస్తూ ఉన్నాయి. వీరిద్దరు ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. వీరి మధ్య మంచి అనుబంధం కూడా ఉందని చెప్పవచ్చు. మంచు కుటుంబానికి భూమా కుటుంబానికి చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మనోజ్ మౌనికాల వివాహం మోహన్ బాబుకు ఇష్టం లేదని ప్రచారం వీరి వివాహ సమయంలో జరిగింది

అందుకే మోహన్ బాబు ఈ పెళ్లి వేడుకలకు కూడా దూరంగా ఉన్నారని వార్తలు వినిపించాయి కేవలం తన అక్క మంచు లక్ష్మి దగ్గరుండి మరి మనోజ్ వివాహాన్ని చేయించింది. అయితే పెళ్లి సమయానికి కొన్ని గంటల ముందు మోహన్ బాబు హాజరై తన కుమారుడిని, భూమ మౌనికను ఆశీర్వదించడం జరిగింది. ప్రస్తుతం మనోజ్ సినిమాల విషయానికి వస్తే వాట్ ది షిప్ టైటిల్ తో ఒక సినిమాని ప్రకటించడం జరిగింది. అలాగే మరో రెండు సినిమాలు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. మరి మనోజ్- భూమ మౌనిక తల్లిదండ్రులు కాబోతున్నారని విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారు చూడాలి..