టాలీవుడ్ లో ర‌జ‌నీ సంచ‌ల‌న రికార్డ్‌.. తెలుగులో `జైల‌ర్‌`కు ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

టాలీవుడ్ లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సంచ‌ల‌న రికార్డును సృష్టించారు. రీసెంట్ గా ఈయ‌న `జైల‌ర్` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. వ‌ల‌ర్డ్ వైడ్ గా కాసుల వ‌ర్షం కురిపించింది. డ‌బ్బింగ్ మూవీ అయిన‌ప్ప‌టికీ కూడా తెలుగులో జైల‌ర్ విధ్వంసం సృష్టించింది.

పోటీగా దిగిన చిరంజీవి `భోళా శంక‌ర్` ను ఓ రేంజ్ లో డామినేట్ చేసేసింది. నిజానికి రజనీ సినిమాలు గతకొంత కాలంగా తెలుగులో కనీసం పబ్లిసిటీ ఖర్చులను కూడా వ‌సూల్ చేయ‌బోతోంది. కానీ, జైల‌ర్ మాత్రం ఎవ‌రి ఊహ‌ల‌కు అంద‌ని రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. జైల‌ర్ తెలుగు థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను రూ. 12 కోట్ల‌కు కొనుగోలు చేశారు.

అయితే ఆగ‌స్టు 10న విడుద‌లైన ఈ చిత్రం.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏకంగా రూ.42 కోట్లకు పైగా షేర్‌ను రూ.80 కోట్ల రేంజ్‌లో గ్రాస్‌ను కలెక్ట్‌ చేసింది. అంటే బయ్యర్లు జైల‌ర్‌ రూ.30 కోట్ల ప్రాఫిట్స్‌ను అందించింది. ఇప్పటివరకు ఏ డబ్బింగ్ సినిమా కూడా ఈ రేంజ్‌లో ప్రాఫిట్స్‌ తీసుకురాలేదు. దీంతో అత్యధిక ప్రాఫిట్స్‌ తెచ్చిపెట్టిన తొలి డబ్బింగ్‌ సినిమాగా జైలర్‌ రికార్డులకెక్కింది.