బాలయ్య కొడుకు మోక్షజ్ఞకు.. అనుష్క శెట్టికి ఉన్న రిలేషన్ ఏంటో మీకు తెలుసా..?

సౌత్ ఫిలిమ్‌ ఇండస్ట్రీలో సుధీర్గ కాలం నుంచి స్టార్ హీరోయిన్గా సత్తా చాటుతున్న ముద్దుగుమ్మల్లో అనుష్క శెట్టి ఒకటి. ఈ బెంగళూరు బ్యూటీ సూపర్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. విక్రమార్కుడుతో ఫస్ట్ హిట్ను ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగుతోపాటు తమిళ్ లోను బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తోనూ ప్రేక్షకులను తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది.

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తయిన అనుష్క క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఇప్పటికీ దర్శక, నిర్మాతలు ఆమెతో సినిమాలు చేసేందుకు పోటీ పడుతున్నారు. కానీ అనుష్క మాత్రం సినిమాల విషయంలో మునుపటి జోరు ఏమాత్రం చూపించడం లేదు. చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తుంది. ఇది పక్కన పెడితే అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగ టీచర్గా పని చేసిన విషయం తెలిసిందే. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే… కొందరు సెలబ్రిటీలకు సైతం ఆమె యోగ క్లాసులు చెప్పింది. అందులో టాలీవుడ్ హీరోలు కూడా ఉన్నారు.

అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్, రామ్ చరణ్ కు అనుష్క శెట్టి యోగ క్లాసులు చెప్పింది. అంతే కాదు నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ కు కూడా అనుష్క యోగ క్లాస్ చెప్పిందట. ఈ విషయం ఇన్ని రోజుల తర్వాత బయటపడడంతో.. నీటిజెన్లు అవునా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అనుష్క నుంచి త్వరలోనే మిస్ సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రాబోతుంది. నవీన్ పోలిశెట్టి హీరోగా పి. మహేష్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ సెప్టెంబర్ 7న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి