ప్రభాస్ కి బట్టతల ఉందా?.. సడన్గా ఇంత ఘోరంగా అయ్యాడేంటి..‌‌!!

మన టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోలకు జుట్టు మొత్తం ఎప్పుడో ఊడిపోయింది. కొంతమంది హీరోలు విగ్గుతో మ్యానేజ్ చేస్తూంటే, మరికొందరు హీరోలు ఓపెన్ గానే బట్టతలతో తిరుగుతున్నారు. నిన్నటి తరం హీరోల్లో చిరంజీవి, వెంకటేష్, నాగార్జునకి ఇప్పటికీ మంచి జుట్టు ఉండగా… బాలకృష్ణ కి ఎప్పుడో బట్టతల వచ్చేసింది. ఇక నేటి తరం హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి బట్టతల వచ్చిందని, ఆయన హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేపించుకున్నారని అందరూ అంటారు.

అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు ఇక‌ ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి కూడా బట్టతల ఉంది అంటూ సోషల్ మీడియాలో లీకైన ప్రభాస్ ఫోటోలు అందరినీ షాక్‌కి గురి చేశాయి. బట్టతలతో ఎవరో అమ్మాయితో కలిసి ప్రభాస్ దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోని చూసి ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ప్రభాస్ ఏంటి సడన్గా ఇలా అయిపోయాడు? బయటకు వచ్చినప్పుడల్లా ప్రభాస్ తలకి గుడ్డ చుట్టుకునేది ఇందుకోసమేనా?

బట్టతలని కప్పిపుచ్చుకోవడం కోసమే ఇన్ని రోజులు ఆయన ఇలా చేశాడా? అసలు మన కళ్ళని మనమే నమ్మలేకపోతున్నామే, ప్రభాస్ ని అసలు ఇలా చూడలేకపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలా ఆ ఫోటో బాగా వైరల్ అయిపోయిన తర్వాత తెలిసింది ఏమిటంటే, ఇది నిజమైన ఫోటో కాదు ఫేక్ ఫోటో అట‌. నిజమైన ప్రభాస్ ఫోటో వేరేదని, ఇంతకుముందు వచ్చిన ఫోటోలు ప్రభాస్ అంటే ఇష్టం లేని వాళ్ళు కావాలని క్రియేట్ చేశారని తెలిసింది. ప్రభాస్ చిన్న సినిమాల‌తో, ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుటంతో ఆయనకి శత్రువులు కూడా ఉన్నార‌ని అంటున్నారు.