HBD: గుంటూరు కారం చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్.. రిలీజ్ డేట్ తో పాటు..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. ఈ రోజున మహేష్ బాబు 48 వ బర్తడే సందర్భంగా మహేష్ సినిమా అప్డేట్ల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది త్రివిక్రమ్ తో మహేష్ బాబు తన తదుపరిచిత్రాన్ని మొదలుపెట్టడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి విడుదల తేదీ పైన మరే ఇతర అప్డేట్ల పైన కూడా క్లారిటీ ఇవ్వలేదు.అంతేకాకుండా పలు రకాల రూమర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి.

హీరోయిన్ పూజ హెగ్డే తప్పకుండా వార్తలు వినిపించడంతోపాటు కొంతమంది టెక్నీషియన్స్ కూడా తప్పుకున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గుంటూరు కారం అనే టైటిల్ని మాత్రం చిత్ర బృందం రివిల్ చేయడం జరిగింది. దీంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి బ్రేకులు పడ్డాయని వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ సినిమా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, ఆలీ ,సునీల్, జగపతిబాబు తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక హీరోయిన్స్ గా మీనాక్షి చౌదరి, శ్రీ లీల నటిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో హారిక హాసిని క్రియేషన్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. గుంటూరు కారం సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ మాస్ గ్లింప్స్ విడుదల కాగా అందరిని ఆకట్టుకుంది.ఈ రోజున మహేష్ బాబు బర్తడే సందర్భంగా కొద్దిసేపటి క్రితం ఒక స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేశారు చిత్ర బృందం ఈ పోస్టర్లో మహేష్ బాబు లుంగీ కట్టిన మాస్ లుక్ వైరల్ గా మారుతోంది .ఈ సినిమా పైన అందరిలో మరింత అంచనాలు పెరిగే విధంగా ఈ సినిమా వచ్చేయడాది 12 సంక్రాంతి కానుకగా థియేటర్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడం జరిగింది.