పెళ్లిపై షాకింగ్ పోస్ట్ చేసిన పాయల్ రాజ్ పుత్.. ఏకీపారేస్తున్న నేటిజన్స్..!!

Rx -100 సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. ఈ చిత్రంలో నెగటివ్ షేడ్స్ పాత్రలో కనిపించిన ఈ అమ్మడుకు మంచి పాపులారిటీ సంపాదించింది. అంతేకాకుండా ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన ఎక్కువగా ఇలాంటి ఆఫర్లే రావడంతో ఆమె కొన్ని సినిమాలను తిరస్కరించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో గ్లామర్ వలకబోయడంలో ఈ హీరోయిన్ కి సాటి రారు అనే విధంగా హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉండేది.

గత కొన్ని సంవత్సరాల క్రితం తన ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ట్రెండింగ్లో నిలుస్తూ ఉంటుంది పాయల్. తాజాగా మరొకసారి ఈ ముద్దుగుమ్మ వార్తలలో నిలిచే పని చేస్తోంది .అయితే ఈసారి హాట్ ఫోటోలు వల్ల కాకుండా ఆమె చేసిన కామెంట్లు వల్ల వార్తలలో నిలుస్తోంది. అదేమిటంటే తన సోషల్ మీడియాలో నీకు ఇంకా సోల్మెట్ కనిపించలేదని బాధపడాల్సిన పనిలేదు.. ఎందుకంటే వివాహమైన వాళ్లు కూడా ఇంకా తమ వారి సోల్ మేట్ కోసం వెతుకుతూనే ఉన్నారంటూ కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది.

Payal Rajput goes backless in 'Mangalavaram' poster - Telugu News - IndiaGlitz.com

వివాహమైన తరువాత తమ సోల్మెట్ కోసం వెతుక్కుంటున్న కారణంగా విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారంటూ కొంతమంది ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన పోస్ట్ కి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది భారతీయ పెళ్లి వ్యవస్థను అవమానించినట్టుగా కామెంట్స్ చేస్తున్నారంటూ తెలియజేస్తున్నారు. ఈమెకి పెళ్లి పై ఆసక్తి లేకుంటే పెళ్లి వ్యవస్థ పై నమ్మకం లేకుంటే సోలోగా ఉండవచ్చు అంటూ సజెషన్ ఇస్తున్నారు. కానీ ఇలా ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరికాదు అంటూ పాయలను ఏ పారేస్తున్నారు నేటిజన్స్.. మరి ఏ మేరకు ఈ అమ్మడు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.