ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడు ఓ స్టార్ హీరో.. ఎవ‌రో గెస్ చేస్తే మీరు నిజంగా తోపే!

పైన ఫోటోలో క‌నిపిస్తున్న బుడ్డోడు ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? అత‌నో స్టార్ హీరో. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్ తో స్టార్ అయ్యాడు. ఆ త‌ర్వాత పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండ‌టం ఆ హీరో నైజాం. ఇక స‌ద‌రు హీరోకు మొహ‌మాటం బాగా ఎక్కువ‌. ఈపాటికే అత‌నెవ‌రో గెస్ చేసి ఉంటారు.. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చిన్న‌నాటి ఫోటో అది.

చిన్నత‌నం నుంచి న‌ట‌న‌పై ఇంట్రెస్ట్ లేక‌పోయినా.. టీనేజ్ లో సినిమాల‌పై మ‌క్కువ పెరిగింది. హీరో అవ్వాల‌ని డిసైడ్ అయ్యాడు. ఇదే విష‌యాన్ని ఇంట్లో చెప్పాడు. మొద‌ట అంద‌రూ షాకైనా.. ఆ త‌ర్వాత ప్ర‌భాస్ ను స‌పోర్ట్ చేశారు. పెద‌నాన్న కృష్ణంరాజు వార‌స‌త్వాన్ని పునికిపుచ్చుకుని ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ప్ర‌భాస్‌.. కెరీర్ ఆరంభంలో కాస్త త‌డ‌బ‌డినా ఆ త‌ర్వాత హీరోగా నిల‌దొక్కుకున్నాడు. రెబ‌ల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

అభిమానుల‌కు డార్లింగ్ అయ్యాడు. బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం చేతి నిండా భారీ ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్నాడు. ప్ర‌భాస్ త్వ‌ర‌లోనే `స‌లార్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను పల‌క‌రించ‌బోతున్నాడు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మాస్ యాక్ష‌న్ డ్రామా రెండు భాగాలుగా విడుద‌ల కానుంది. ఫ‌స్ట్ పార్ట్ ను సెప్టెంబ‌ర్ లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. అలాగే వ‌చ్చే సంక్రాంతికి నాగ్ అశ్విన్‌, ప్ర‌భాస్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న `కల్కి 2898 ఏడీ` విడుద‌ల కానుంది. మ‌రోవైపు మారుతితో కూడా ప్ర‌భాస్ ఓ సినిమా చేస్తున్నాడు.