అలాంటి పని చేయకపోతే ఆంటీ పాత్రలే ఇస్తారంటూ తమన్నా బోల్డ్ కామెంట్స్..

ప్రముఖ నటి మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత పదేళ్లలో ఇండస్ట్రీ లో తమన్న కి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి రాలేదు. తన గ్లామర్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఉపేసింది. ఈ అమ్మడు తెలుగు లో దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలందరితో ఆడి పాడింది. ‘హ్యాపీ డేస్’ సినిమా తో ఈ అమ్మడికి క్రేజ్ మొదలైంది. <span;>ఇక రచ్చ లాంటి సినిమాల్లో గ్లామర్ పంట పండించి కుర్రాళ్ల కలల రాణిగా మిగిలిపోయింది.

ప్రస్తుతం తమన్నా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్,హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అల్లరిస్తుంది. ఇటీవల తమన్నాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అదేంటంటే ‘ఇక ఇండస్ట్రీ లో తమన్న కెరీర్ ముగిసిపోతుంది  ‘ అంటూ చాలా మంది కామెంట్స్ చేసారు. ఆ సమయంలో తమన్నా తన సినిమాలతో వారందరికీ గట్టిగానే సమాధానం చెప్పింది. ప్రస్తుతం ఈ మిల్కీ  బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

అలానే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ సినిమాలో కూడా తమన్నా హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఆగస్టు 10 అనగా ఈరోజు థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన ‘ నువ్ కావలయ్యా ‘ పాట అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా తమన్నా బోల్డ్ సీన్స్ లో నటించడం గురించి స్పందించింది. తమన్నా మాట్లాడుతూ ‘ కొన్నిసార్లు పరిది దాటి నటించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి సన్నివేశాలో నటించకపోతే స్టార్ హీరోలకు అక్కగా, చెల్లెలుగా నటించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకూడదాని నేను బోల్డ్ సీన్స్ లో నటించడని సిధపడ్డాను ‘ అంటూ
చెప్పుకొచ్చింది.