రాజ‌మౌళి `ఈగ‌`లో విల‌న్ రోల్ ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి చేసిన ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో `ఈగ‌` ఒక‌టి. న్యాచుర‌ల్ స్టార్ నాని, అందాల భామ స‌మంత ఇందులో జంట‌గా న‌టించారు. క‌న్న‌డ స్టార్ హీరో సుదీప్ స్టైలిష్ విల‌న్ గా అద‌ర‌గొట్టాడు. సురేష్ ప్రొడక్షన్స్, వారాహి చలన చిత్రం, మకుట గ్రాఫిక్స్ బ్యాన‌ర్ల‌పై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. కీర‌వాణి స్వ‌రాలు అందించారు. హీరోల‌తో సినిమాలు చేసి హిట్ కొట్ట‌డం ఎవ్వ‌రైనా చేస్తారు.

కానీ, రాజ‌మౌళి రూటే స‌ప‌రేటు. అల్పజీవి అయిన ఈగ‌తో సినిమా చేసి సంచ‌ల‌నాలు సృష్టించారాయ‌న‌. 2012 జులై 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం.. రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ఈగ ప్రతి కదలికను తెరపై ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. గ్రాఫిక్స్ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది. స్టార్ హీరోలు, హీరోయిన్లు, పాట‌లు, ఫైట్లు కాదు.. కంటెంట్ ఉండే ఎలాంటి సినిమా అయినా హిట్ అవుతుంద‌ని ఈగ నిరూపించింది.

ఇక‌పోతే ఈ సినిమాలో విల‌న్ గా సుదీప్ న‌ట‌న అద్భుతం. హీరో నాని కంటే సుదీప్ పాత్రే సినిమాకు హైలెట్ గా నిలిచింది. అయితే నిజానికి ఈ పాత్ర‌ టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో వ‌ద్ద‌కు వెళ్ల‌గా.. ఆయ‌న రిజెక్ట్ చేశాడ‌ట‌. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు.. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. అప్ప‌టికే ర‌వితేజ‌తో రాజ‌మౌళి `విక్రమార్కుడు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ చేశాడు. ర‌వితేజ టాలెంట్ తెలుసు కాబ‌ట్టి.. ఈగ‌లో ఆయ‌న్ను విల‌న్ గా పెట్టాల‌ని ర‌వితేజ భావించాడు. కానీ, ర‌వితేజ వేరే సినిమాల‌తో బిజీగా ఉండ‌టం వ‌ల్ల సున్నితంగా రాజ‌మౌళి ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించాడు. దాంతో రాజ‌మౌళి క‌న్న‌డ స్టార్ సుదీప్ ను రంగంలోకి దింపి ఈగ మూవీని చేశాడు.