డైరెక్టర్ లోకేష్ కనకరాజు.. కొన్న ఈ కారు ఎన్ని కొట్లో తెలుసా..?

డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వస్తున్న సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కమలహాసన్ తో విక్రమ్ సినిమాని తెరకెక్కించి కమలహాసన్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్ సాధించిన చిత్రంగా పేర్కొన్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్లలో స్టార్ హీరోలు సైతం ఎక్కువగా ఈ డైరెక్టర్ తో సినిమాలు చేయాలని ఆత్రుత పడుతున్నారు.. లోకేష్ కనకరాజు కెరియర్లో గ్యాంగ్ స్టార్, ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించారు.

Lokesh Kanagaraj (@Dir_Lokesh) / X

ప్రస్తుతం విజయ్ దళపతి తో లియో సినిమాని పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. డైరెక్టర్ లోకేష్ కనకరాజు చిత్రాలు తెలుగులో కూడా మంచి పాపులారిటీ అందుకుంటున్నాయి. తాజాగా ఈయన ఒక కాస్ట్లీ కారు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది..BMW 7 సిరీస్ కు చెందిన లేటెస్ట్ వర్షన్ కారుని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దీని ధర అక్షరాల రూ.1.70 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారుతో లోకేష్ కనకరాజు దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Lokesh Kanagaraj | Lokesh Kanagaraj bought a new car.. Do you know how much  it cost?-Namasthe Telangana

గతంలో విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని రావడంతో కమలహాసన్ సైతం లోకేష్ కు ఒక కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇచ్చారు.. లోకేష్ కనకరాజు తెరకెక్కిస్తున్న లియో సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రాన్ని దాదాపుగా 250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. సంగీతాన్ని అనురుద్ అందిస్తూ ఉన్నారు. మరి లియో సినిమాతో తన హవా కొనసాగిస్తారేమో చూడాలి మరి.