నాగార్జున హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి… ఆమెను గుర్తు ప‌ట్టారా ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఎంతోమంది కొత్త హీరోయిన్‌లు అడుగు పెడుతూనే ఉంటారు. నటించింది చాలా తక్కువ సినిమాలే ఆయిన మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. తర్వాత ఫ్లాప్ లు రావడంతో ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోతారు. అలాంటి వారి లిస్ట్ లోకి వస్తుంది ఈ స్టార్ హీరోయిన్. ఒకప్పుడు నాగార్జున సరసన నటించి ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించింది. 2002లో మొదటిసారిగా టాలీవుడ్‌కి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

నాగార్జునతో నటించిన మొదటి సినిమా సక్సెస్ సాధించలేదు దాంతో ఆమెకు అవకాశాలు రావనుకున్నారు అయినా ఓ సినిమాలో అవకాశం వచ్చింద ఈ సినిమా కూడా ప్లాప్ అవడంతో తర్వాత ఆమెకు అవకాశాలు రాలేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె గ్రేసీ సింగ్. ఈ పేరు ఎక్కడ విన్నట్టుందే.. ఎక్కడో చూసినట్టుందే అనుకుంటున్నారా మీరు అనుకునేది కరెక్టేనండి. సంతోషం సినిమాలో నాగార్జున పక్కన శ్రేయాతో పాటు నటించిన మరో హీరోయిన్. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గ్రేసీ సినిమా హిట్ కాకపోయినా మరో సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది.

ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈమె భరతనాట్యం, ఒడిసి లాంటి క్లాసికల్ డాన్స్ లలో మంచి ప్రావీణ్యత పొందింది. డాన్స్ గ్రూపుల్లో ప్రదర్శనలు ఇస్తూనే గుర్తింపు తెచ్చుకుని 17 ఏళ్లకే సీరియల్ నటిగా అడుగుపెట్టింది.
ఆ సీరియల్ ద్వారా పాపులారిటీ సంపాదించుకొని 19 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చింది. 2001లో అమీర్ ఖాన్ లాగన్ సినిమా గ్రేసీకి మంచి గుర్తింపు తెచ్చింది. ఒక ఏడాది తేడాతో తెలుగులో అడుగుపెట్టి సంతోషం. అప్పు చేసి పప్పుకూడు సినిమాల్లో నటించింది.

ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. 2010లో మరోసారి రామ రామ కృష్ణ కృష్ణ, రామ్‌దేవ్ సినిమాలలో గెస్ట్ రోల్ ను ప్లే చేసింది. కానీ ఆమెకు గుర్తింపు రాలేదు. దీంతో మళ్ళీ హిందీ, పంజాబీలో 2017 వరకు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. అప్పట్లో అందంగా ఉన్న గ్రేసి వయసు పెరిగే కొద్దీ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇటీవల ఆమె ఫొటోస్ చూస్తున్న ప్రేక్షకులు ఆమె ఎవరో అని కాస్త తికమక పడుతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Gracy Singh (@iamgracysingh)