చిరంజీవి ప్రోత్సాహం వల్లే ఇంతమంది హీరోల కెరీర్ మారిందా…

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్’ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అందరూ ఈ సినిమా హిట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు. అయితే చిరంజీవి అభిమానులే కాకుండా సినీ ప్రముఖులు కూడా భోళా శంకర్ సినిమాలో చిరు లుక్స్ అదిరిపోయాయి అని మెచ్చుకుంటున్నారు.

ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఒక వేడుకకు భోళా శంకర్ మూవీ యూనిట్ తో పాటుగా తెలుగు ఇండస్ట్రీ కి చెందిన సినీ ప్రముఖులు కూడా కొందరు హాజరయ్యారు. ఈ వేడుకలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది, రామ్ చరణ్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో  వైరల్ గా మారాయి. భోళా శంకర్ సినిమాకి సంబందించిన అన్ని ఈవెంట్స్ లో హైపర్ ఆది పాల్గొంటున్నాడు. ఎందుకంటే ఆది ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ లో నటించాడని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో సినిమాలో హైపర్ ఆది అవకాశం దక్కించుకోవడం అనేది చిన్న విషయం కాదు.

చిరంజీవి సినిమాలో నటించిన ఆది అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరో హీరోయిన్లు చిన్న నటులను అసలు పట్టించుకోరు. పైగా వాళ్ళని చిన్నచూపు చూస్తుంటారు. అలాంటిది చిరంజీవి మాత్రం చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిని సమానంగా చూస్తూ, ప్రతీ ఒక్కరిని ఎంకరేజ్ చేస్తుంటాడు. అలా చిరంజీవి ఎంకరేజ్ చేసిన నటినటులు ఇండస్ట్రీ లో చాలా మందే ఉన్నారు. వాళ్లలో కొరియోగ్రాఫర్ లారెన్స్ ఒకరు. అలానే చిరంజీవి స్నేహితుడు హరిబాబు కూడా చిరు ఎంకరేజ్ చేసినవారిలో ఒకరనే చెప్పాలి. ఇక ఆ లిస్ట్ లోకి ఇప్పుడు హైపర్ ఆది కూడా చేరిపోయ్యడు.