శోభిత వేసుకున్న ఆ డ్రెస్ సింపుల్ గా ఉన్నా టూ కాస్ట్లీ.. ఎంతో తెలిస్తే గుండె ఆగుద్ది!

మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ శోభిత ధూళిపాళ్ల గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెనాలిలో జ‌న్మించిన అచ్చ తెలుగు అమ్మాయి అయిన శోభిత‌.. త‌న ఫిల్మ్ కెరీర్ ను బాలీవుడ్ లో స్టార్ట్ చేసింది. త‌న‌దైన టాలెంట్ తో అక్క‌డ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో గూఢచారి, మేజ‌ర్ వంటి చిత్రాల్లో మెరిసింది. అలాగే మ‌ణిశ‌ర్మ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `పొన్నియన్ సెల్వన్`లో జయం రవికి జోడీగా న‌టించి మెప్పించింది.

ప్ర‌స్తుతం సౌత్‌, నార్త్ తో పాటు ఓ హాలీవుడ్ మూవీలోనూ శోభిత న‌టిస్తోంది. అలాగే శోభితా లీడ్ రోల్ చేసిన ‘మేడ్ ఇన్ హెవెన్ 2’ సిరీస్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించిన తొలి భాగం ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యి సూప‌ర్ స‌క్సెస్ అయింది. ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ త‌ర‌చూ అదిరిపోయే ఫోటో షూట్ల‌తో త‌న ఫాలోవ‌ర్స్ ను అల‌రిస్తుంటుంది. తాజాగా కూడా ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు పంచుకుంది. మ‌ల్టీ క‌ల‌ర్ టాప్ లెస్ ట్రెండీ ఫ్రాక్ ధ‌రించి.. టెంప్టింగ్ గా ఫోటోలకు పోజులిచ్చింది.

డ్రెస్‌కు తగినట్టుగా మల్టీ కలర్ బ్యాంగిల్స్, ఇయ‌ర్ రింగ్స్ పెట్టుకొని ఒంపులు పోయింది. ఆమె ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి. అయితే ఈ పిక్స్ లో శోభిత వేసుకున్న డ్రెస్ సింపుల్ గానే ఉన్నా టూ కాస్ట్లీ. ఎంతో తెలిస్తే గుండె ఆగుద్ది. ఎందుకంటే, శోభిత గౌను ధ‌ర అక్ష‌రాల రూ.22,990. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అట్సు అనే బ్రాండ్‌కి చెందిన డ్రెస్ ఇది. దీనికి భావ్నా శర్మ స్టైలింగ్ చేసింది. ఫ్యాషన్ ఎక్స్‌పర్ట్స్ మాత్రం ఈ సింపుల్, కాస్ట్‌లీ డ్రెస్ పర్ఫెక్ట్ సమ్మర్ వేర్ అని అభిప్రాయ‌పడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sobhita (@sobhitad)