“గాండీవధారి అర్జున” ట్రైలర్ వచ్చేసింది.. వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్ పక్కా..!

టాలీవుడ్ యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ గాండీవ ధారి అర్జున.. ఈ సినిమాను ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజ‌ర్, పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఇక ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఇక‌ ట్రైలర్లో విజువల్స్ కూడా ఎంతో సూపర్ గా ఉన్నాయి. స్పై ఏజెంట్గా వరుణ్ తేజ్ నటన ఎంతో అద్భుతంగా ఉంది. తనపై అధికారి నాజర్ ఇచ్చిన మిషన్ కోసం హీరో ఏం చేస్తూ ఉంటారు ఆ మిషన్ ని ఎలా కంప్లీట్ చేశాడు.. హీరోయిన్ సాక్షి వైద్యతో ప్రేమలో ఎలా పడ్డాడు అనేది సినిమాలో చూస్తే అర్థమవుతుంది.

ఇక ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ అందించిన బిజిఎం మ్యూజిక్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. ఇక మరి వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ తర్వాత వస్తున్న ఈ సినిమా ఈ మెగా హీరోకు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలంటే ఈనెల చివరి వరకు వెయిట్ చేయాల్సిందే.